Shruti Haasan : సినిమా ఇండస్ట్రీలో ఈరోజు వెలుగొందిన తారలు చివరి రోజుల్లో ఎలా ఉంటారో చెప్పలేం. ఎందుకంటే సినిమా అనేది జూదం లాంటిది. ఒక సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ లో స్టార్ లు అయిపోతారు. అలాగే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే కిందకు పడిపోతారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు, హీరోలు క్రేజ్ ఉన్నప్పుడే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదిస్తూ ఉంటారు. వరుసగా హిట్లు పడితేనే ఇండస్ట్రీలో కొనసాగుతారు లేదంటే ఫేడ్ అవుట్ అవుతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన తల్లిని పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె చాలా రోజుల నుంచి తన తల్లికి దూరంగా ఉంటుందంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అయితే రీసెంట్ గా శృతిహాసన్ తల్లి సారిక ఓ ఇంటర్వ్యూలో తన కూతురు తన వద్దకు రావడం లేదని, ఎక్కువగా మాట్లాడటం లేదని, కరోనా సమయంలో కూడా శృతిహాసన్, కమల్ హాసన్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని చెప్పారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే తాను స్వశక్తి మీదనే బ్రతుకుతున్నట్లు చెప్పారు. అలాగే ముంబైలో ఉంటూ రూమ్ రెంట్ కట్టుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇది తెలుసుకున్న చాలామంది సినీ అభిమానులు శృతిహాసన్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన తల్లిని దూరంగా పెట్టి ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరి కాదని శృతిహాసన్ మీద భారీ ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్, శృతిహాసన్ చెన్నైలోనే ఉంటున్నారు. కానీ ఆమె మాత్రం ముంబైలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ వయసులో తల్లిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, ఆమెను మీ దగ్గర ఉంచుకోండి అని సలహాలు ఇస్తున్నారు. అయితే ఇక్కడ శృతిహాసన్ తల్లి సారిక కూడా ఒకప్పుడు హీరోయిన్ అట. కానీ ఆమె ఆస్తులు ఏమి వెనక వేసుకున్నట్లుగా లేదనుకుంటా.