Tamannaah : సినీ పరిశ్రమలో హీరోయిన్ తమన్నాకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా ఇంకా హీరోయిన్ గానే సినిమాలు చేస్తుంది. హీరో వరుణ్ సందేశ్ నటించిన ‘ హ్యాపీడేస్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా హిట్ తర్వాత తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ బాహుబలి ‘ సినిమాలో నటించి యువకుల మనుసులను దోచుకుంది. ప్రస్తుతం చిరంజీవి సరసన బోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. అయితే తమన్నా తన ఇన్నాళ్ళ సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోలతో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే తమన్న తనతో నటించిన ఓ హీరోతో ప్రేమ వ్యవహారం నడిపిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తమన్నాతో కలిసి ‘ ఆవారా ‘ సినిమా చేశాడు. ఆ తర్వాత ‘ ఊపిరి ‘ అనే సినిమా కూడా చేశాడు. రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత కార్తీక్ తమన్నా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు కోలీవుడ్ లో వైరల్ అయ్యాయి. అలాగే పబ్లిక్ గానే వీళ్ళిద్దరూ మీడియా ముందు కనిపించడంతో ఆ వార్తలు నిజమే అంటూ అభిమానులు అనుకున్నారు.
Tamannaah : తన రెమ్యూనరేషన్ మొత్తం తమన్నాకు ఇచ్చిన స్టార్ హీరో… ఎందుకు ఇలా చేశాడంటారు…!

కాగా ఆ టైంలో ఓ న్యూస్ సంచలనంగా మారింది. హీరోయిన్ తమన్నా కోసం కార్తీక్ తన సినిమా రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఆమెకే ఇచ్చేసాడని, తమన్నా అంటే కార్తీకి చాలా ఇష్టమని, కోలీవుడ్ లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఏమైందో తెలియదు కానీ అప్పటి వరకు బాగానే ఉన్నా వీరిద్దరూ సడన్ గా దూరమయ్యారు. దీంతో తమన్నా, కార్తి బ్రేకప్ అంటూ మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఇప్పటివరకు దీనిపై అటు తమన్నా, ఇటు కార్తీ క్ స్పందించలేదు. ప్రస్తుతం తమన్న సినిమాలతో బిజీగా ఉంది. కార్తీ కూడా తనకొచ్చిన సినిమాల్లో నటిస్తూ హీరోగా ముందుకు వెళుతున్నాడు.