Kajal Agarwal : ఇండస్ట్రీలో ఎన్నో మూవీలను చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ కాజల్. ఈమె ఇటీవల లో పెళ్లి చేసుకుని ఒక బేబీకి జన్మనిచ్చి కూడా తన కమర్షియల్ యాడ్స్ చేస్తూ దూసుకుపోతుంది. పెడవుట్ అయిన హీరోయిన్స్ ను అంత తొందరగా ఇండస్ట్రీలో వారు ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఈమె టాలెంటెడ్ హీరోయిన్. అందరితో కలిసిపోతూ ఉంటుంది. పెళ్లయిన కానీ ఈమె అందం కాస్తంత కూడా తగ్గిపోకుండా ఇంకాస్త గ్లామర్ పెంచేసుకుని ఫిజిక్ తో మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా తను మూవీ చేస్తే ప్లస్ అవుతుంది. అలాగే బిజినెస్ కూడా అవుతుందని అనుకున్న వాళ్లు అయితే ఆమెకి కాదనకుండా చాన్సులు ఇస్తారు. చెప్పాలంటే అప్పట్లో వివాహం తదుపరి కూడా సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.
కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో పెళ్లయిన తర్వాత సినిమాలో రీఎంట్రీ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ. అంతే పెళ్లయిన హీరోయిన్ అంటే పెద్దగా ఆసక్తి చూపించరు అభిమానులు. హీరోయిన్ ప్రియమణి లాంటి వాళ్లు మళ్లీ హీరోయిన్గా అడుగు పెట్టాలి అనుకున్న వారికి హీరోలు, మేకర్స్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. నేషనల్ అవార్డ్స్ పొందిన ప్రియమణి నారప్ప మూవీ తో అడుగుపెట్టిన మళ్లీ కనిపించడం లేదు. అదేవిధంగా ప్రస్తుతం కాజల్ పరిస్థితి కూడా అట్లానే ఉంటుందా.. అని అభిమానులు ఆసక్తిగా ముచ్చటిస్తున్నారు. దానికి కారణం కాజల్ కి వివాహంతో పాటు ఓ బిడ్డకి కూడా జన్మనివ్వడమే. వివాహం వరకు ఓకే గాని తల్లి అయిన తదుపరి కూడా కాజోల్ని హీరోయిన్గా ఒప్పుకుంటారా.? అంటే ప్రస్తుతం సరియైన సమాచారం అందడం లేదు.
Kajal Agarwal : తనని వదలము అంటున్న స్టార్ హీరోలు…

అయితే కాజల్ అందం పరంగా గనక జాగ్రత్తలు వహిస్తే స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందని అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఎందుకనగా స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే కాజల్ ఇండియన్ టు మూవీ చేస్తుంది. కాజల్ సొంతంగా ఈ విషయాన్ని తెలియజేసింది. అందుకే కాజల్ ని తీసుకునేందుకు పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు హీరోలు సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. టాలీవుడ్ లో కాకపోయినా కోలీవుడ్ లో అగ్ర హీరో కమల్ హాసన్, విక్రమ్, అజిత్ లాంటి హీరోలు కాజోల్ ని తమ మూవీలకు సిఫార్సు చేసే ఛాన్సులు ఉంటాయంటున్నారు. అయితే కాజల్ కూడా రీఎంట్రీ కి గట్టిగానే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ ఇంకొక వైపు మూవీ స్టోరీలని చదువుతోంది. తొందర్లో న్యూ ప్రాజెక్ట్ వివరాలను తెలియజేయునుంది. చూడాలి మరి ఈ హీరోయిన్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.