Rajinikanth : ఇటీవల విడుదలై బ్లాక్ పాస్టర్ అందుకున్న ” జైలర్ ” మూవీతో రజినీకాంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు.వరల్డ్ వైడ్ గా 600 కోట్లకు పైగా వసూలు సాధించిన జైలర్ ఇప్పుడు 700 కోట్లకు పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో సినిమాకు భారీ లాభాలు రావడంతో జైలర్ నిర్మాత రజనీకాంత్ కి మరియు డైరెక్టర్ కి కార్లను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలైవాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ వార్త సినీ ఇండస్ట్రీ తో పాటు పొలిటికల్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.
అదేంటంటే సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే గవర్నర్ కాబోతున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి .ఇలా వస్తున్న వార్తలపై తాజాగా రజనీ సోదరుడు సత్యనారాయణ స్పందించాడు. ఆదివారం నాడు మధురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా అన్న రజనీకాంత్ కు గవర్నర్ పదవి రావడం ఆ దేవుడు చేతిలో ఉందని సత్యనారాయణ తెలియజేశారు. అయితే రజనీకాంత్ మాత్రం గవర్నర్ పదవిపై ఎలాంటి ఆశ పెట్టుకోలేదని , ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామన్నారు.
అయితే రజినీకాంత్ కు గవర్నర్ వస్తుందని అంశం మరోసారి తెరపైకి రావడంతో ప్రస్తుతం ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. కాగా గత కొంతకాలంగా రజినీకాంత్ రాజకీయవేత్తలను కలుస్తుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో ఇటీవల ఉత్తర భారతదేశంలో పర్యటించిన రజనీకాంత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , మరియు జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో భేటీ అవ్వడంతో ఈ వార్తకు ఆద్యం పోసినట్లయింది. మరి ఇలా వస్తున్న వార్తలపై రజనీకాంత్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.