Surya : టాలీవుడ్ స్టార్స్ కు షాక్ ఇచ్చిన సూర్య… మెగా హీరోయిన్ తో క్రేజీ డీల్…

Surya : స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో డిఫరెంట్ స్టోరీస్ తో క్రేజీ ప్రాజెక్టులను చేస్తూ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నా ఈ హీరో ప్రజెంట్ కోలీవుడ్ టాప్ హీరోల లిస్టులో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు. ఈ మధ్యనే జాతీయస్థాయిలో అవార్డును దక్కించుకున్నాడు. సూర్యకు కోలీవుడ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలకు కూడా విపరీతమైన ఇష్టం ఉంది. సూర్య చేసిన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు. సూర్యకు కోలివుడ్ లోనే కాదు, తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. క్యారెక్టర్ లో ఎటువంటి బిల్డప్ లేకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు సూర్య.

Advertisement

ప్రస్తుతం హీరో సూర్య మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. కమర్షియల్ హిట్ సినిమాలలో నటించడం లేదు. కానీ రీసెంట్ గా సూర్యా కమర్షియల్ హీరోయిన్ ను సినిమా కోసం ఎంచుకున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీని తన సినిమాలో ఎంచుకున్నట్లు కోలీవుడ్ లో తెగ వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ దిశా పటాని తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘ లోఫర్ ‘ సినిమాలో నటించింది. అంతకు ముందు మోడల్ గా చేసిన ఈ బ్యూటీ వరుణ్ తేజ్ లోఫర్ సినిమా తోనే హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది. అయితే ఈ అమ్మడుకు లోఫర్ సినిమా అంతగా హిట్ ఇవ్వకపోవడంతో తెలుగులో అవకాశాలు అందుకోలేదు.

Advertisement

Surya : మెగా హీరోయిన్ తో క్రేజీ డీల్…

surya acts with tollywood beauty dhisha patani
surya acts with tollywood beauty dhisha patani

కానీ సోషల్ మీడియా ద్వారా దిశా పటాని తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే కనిపించింది. లోఫర్ ప్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీని మర్చిపోయిన దిశా పటానీ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ ఆరబోయడానికి సిద్ధపడింది ఈ హాట్ బ్యూటీ. టాలీవుడ్ లో ఎంతోమంది బిగ్ స్టార్స్ అడిగిన కాల్ షీట్స్ లేవంటూ కొట్టి పడేసిన దిశాపటాని, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అడగగానే కాల్ షీట్లు అడ్జస్ట్ చేసి ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ హీరోలకి బిగ్ షాకింగ్ అంటున్నారు సినీ ప్రముఖులు.

Advertisement