Prabhas Marriage : ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్యామలాదేవి…వధువు ఎవరంటే..

Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? అమ్మాయి ఎవరు అనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ విషయాన్ని ఎన్నోసార్లు ప్రభాస్ ను అడిగిన ఆయన మాత్రం నవ్వుతూ దానిని దాటే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ పెళ్లిపై కొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇక దానికి గల కారణం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి అని చెప్పాలి. అయితే ఇటీవల శ్యామల దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ దేవి ని దర్శించుకున్నందుకు వచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కడి విలేకరులు పెద్ద ఎత్తున దుర్గమ్మ గుడి వద్దకు చేరుకొని ఆమెను ప్రశ్నలు అడిగేందుకు చూడ సాగారు.

Advertisement

syamaladevi-gave-clarity-on-prabhas-marriage-who-is-the-bride

Advertisement

 

ఈ సందర్భంగా విలేకరులు శ్యామలాదేవిని ప్రభాస్ గురించి ఆయన పెళ్లి గురించి కొన్ని ప్రశ్నలను అడగసాగారు. వీటికి బదులుగా శ్యామలాదేవి మాట్లాడుతూ…కృష్ణంరాజు గారి పేరును నిలబెడుతూ మా కుటుంబంలోని ప్రతి ఒక్కరు ముందుకు సాగుతున్నారు. నిజానికి ఆయన బతికున్నప్పుడే ప్రభాస్ పెళ్లి జరగాలి కానీ ఆ సమయంలో ప్రభాస్ వరుసగా సినిమాలను చేయడం షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల జరగలేదు. ఇక ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. త్వరలోనే ఈ శుభకార్యానికి నాంది పలుకుతామంటూ ఆమె తెలియజేశారు. అయితే అమ్మాయి ఎవరు ఆమె వివరాలు ఏంటి…?ఎప్పుడు పెళ్లి చేస్తారనే విషయాలైతే చెప్పలేదు కానీ అతి త్వరలోనే ఈ శుభకార్యం జరుగుతుందని ఆమె తెలియజేశారు.

syamaladevi-gave-clarity-on-prabhas-marriage-who-is-the-bride

వచ్చే దసరా పండుగ నాటికి ప్రభాస్ కి పెళ్లి చేస్తామంటూ శ్యామల దేవి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్నా అభిమానులు ఈ విషయం విన్నాక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా తీస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement