Tejaswi Madivada : హీరోయిన్ తేజస్వి కాంట్రవర్సీయల్ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి పై విరుచుకుపడింది. తాజాగా ఆమె టాలీవుడ్ లో కమిట్మెంట్, క్యాస్టింగ్ కౌచ్ గురించి చెబుతూ శ్రీరెడ్డిని ఒక ఆట ఆడేసింది. హాట్ హీరోయిన్ గా మారి బోల్డ్ రోల్స్ తో కన్విందు చేస్తున్న తేజశ్రీ చాలా రోజుల క్రితం ‘ కమిట్మెంట్ ‘ అనే సినిమాలో నటించింది. పేరుకు తగ్గట్టే సినీ పరిశ్రమలో కమిట్మెంట్ల గుట్టురట్టు చేసేందుకు వస్తుంది. తన జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలో రూపొందుతున్న చిత్రం ఇది. నాలుగు కథలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సినీ ప్రమోషన్ లో భాగంగా అనేక విషయాలను షేర్ చేసుకుంది తేజస్వి మదివాడ.
వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పై హాట్ కామెంట్ చేసింది తేజస్వి. చేయాల్సిన తప్పు చేసి, అంతా అయిపోయాక ఇప్పుడు నేను మోసపోయాను, నన్ను వాడుకున్నారని చెప్పడం కరెక్ట్ కాదని వెల్లడించింది తేజస్వి. మన అంగీకారం లేకపోతే ఏమీ జరగదని, కానీ ఆ టైంలో ఒప్పుకొని ఇప్పుడు ఆ విషయాలను బయట పెట్టడం సరికాదని తెలిపింది. తాను నటించిన కమిట్మెంట్ సినిమాలో అవకాశాల కోసం ఆఫీసుల వెనుక తిరిగే అమ్మాయిగా నటిస్తుంది. ఇది శ్రీ రెడ్డి నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో దీనిపై స్పందించింది. మనం సినీ పరిశ్రమలోకి వచ్చి ఇక్కడే ఉంటూ ఇండస్ట్రీ బాగా లేదనడం సరికాదని ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒక సందర్భంలో కమిట్మెంట్ ని ఫేస్ చేయాల్సి వస్తుందని, కమిట్మెంట్ అడగడము లేక మనతో తప్పుగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్లతో లొంగిపోకుండా ఫైట్ చేయాలని చెప్పింది. నీకు తప్పు అనిపిస్తే ఆ క్షణమే దాని వ్యతిరేకించాలని అది నాకు నచ్చలేదని ముఖం మీద చెప్పాలని వెల్లడించింది.
Tejaswi Madivada : అంతా అయిపోయాక ఇప్పుడు గోల చేయడం ఎందుకు…

ఈ సందర్భంగా శ్రీ రెడ్డిని ఉద్దేశిస్తూ తేజస్వి మాట్లాడుతూ చేయాల్సిన తప్పు చేసేసి నన్ను అందరూ వాడుకున్నారని నన్ను మొత్తం నాశనం చేశారని గోల చేయడం వల్ల ఉపయోగముండదని చెప్పింది. తాను ఇండస్ట్రీలో ఉన్నానని కాదు ప్రతి అమ్మాయికి ఒక సందేశం ఇచ్చేలా ఈ కమిట్మెంట్ సినిమా ఉంటుందని చెప్పింది. నువ్వు చేసేది తప్పా రైటా తెలుసుకోవాల్సింది నువ్వే అని, అంతా అయిపోయాక గోల చేయడం సరికాదు ఇలా చేశారని కామెంట్ చేయడం నాకు నచ్చదు అని తెలిపింది. నీకు తెలియకుండా నిన్ను ఎవరు ఏం చేయలేరు. కమిన్మెంట్ నీకు ఇవ్వాలని లేకపోతే అసలు నిన్ను అడిగిన వారు ఎవరు ఉండరని చెప్పుకొచ్చింది తేజస్వి. మరి శ్రీ రెడ్డి తేజస్వి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి రిప్లై ఇస్తుందో వేచి చూడాలి.