Thamannaah: మిల్క్ బ్యూటీ తమన్నాకు ఇండస్ట్రీలో మరో బంపర్ ఛాన్స్ కొట్టేసినట్టుగా వార్తలు గట్టిగా హల్చల్ చేస్తున్నాయి. తమన్నా డాన్స్ మరియు నటన గురించి మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు సినిమా రంగంలో తమన్నా అడుగు పెట్టి 15 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ 50 సినిమాలు పైగా చేసి తెలుగు తమిళ్ హిందీ భాషలలో తన సత్తాను చాటింది. అంతేకాకుండా రీసెంట్ గా తెలుగులో ఎఫ్3 సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. తమన్నా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ తన రూల్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ ఆచి తూచి ఇప్పటివరకు అడుగులు వేసింది. తను చేసిన ప్రతి సినిమాలో తన గ్లామర్ డోస్ తగ్గకుండా సినిమాలో తనకంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది.
హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లో కూడా చేస్తూ తన ఉనికిని సినిమాలలో చూపిస్తూ అలనాటి తారలైన సౌందర్య, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ల మంచి గుర్తింపుతో ఇండియా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. తాజాగా ఎఫ్2 ఎఫ్3 సినిమాలలో తన అందాల ఆరబోతతో ఈ సినిమాల కి నన్ను ప్రత్యేకంగా నిలిచింది అని చెప్పొచ్చు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రజనీకాంత్ కి జంటగా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తమన్న ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం.
Thamannaah : మిల్క్ బ్యూటీ కి మరో లక్కీ ఛాన్స్

అయితే ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం. అయితే మొదట ఈ సినిమాకి స్టార్ సీనియర్ హీరోయిన్ల పేర్లను పరిశీలించారంట. చివరకు ఈ సినిమాకు తమన్నాను ఎంపిక చేయడం స్టార్ హీరో రజనీకాంత్ సరసన అవకాశం రావడంతో తమన్నా కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాకి తమన్నా ఓకే చెప్పేసిందట. జైలర్ సినిమాకు సంబంధించి రజనీకాంత్ రియల్ రోలో కనిపించగా ఓ పాత్రకు రమ్యకృష్ణ హీరోయిన్ గా చేయబోతుందట. రెండో పాత్ర కోసం తమన్నాను సెలెక్ట్ చేయగా తమన్న ఈ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచేసిందట.