Varun Tej – Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ దంపతులు నంబర్ 1 న ఇటలీలోని ఓ పురాతన గ్రామంలో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి వేడుకలలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ ఫ్యామిలీ మరియు హీరో నితిన్ దంపతులు కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు మూడు రోజులు పాటు జరిగిన ఈ వివాహ వేడుకలలో ప్రతి ఒక్కరు ఆకర్షణీయంగా కనిపించి సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి పనులు పూర్తి అవ్వడంతో ఇటీవల మెగా ఫ్యామిలీ అంతా భాగ్యనగరం చేరుకున్నారు. వారితోపాటు మెగా కోడలిగా హోదా సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి కూడా భాగ్యనగరం చేరుకున్నారు. తాజాగా ఎయిర్ పోర్టు లో నూతన దంపతులు హైదరాబాద్ కు తిరిగి రావడంతో అభిమానులు ఘన స్వాగతం పలికారు. నవ దంపతులు నడుచుకుంటూ వస్తున్న సమయంలోనే అభిమానులు నవ దంపతులపై పూలు చల్లుతూ వారికి ఘనస్వాగతం పలికారు.
#TFNExclusive: Visuals of the lovely couple @IAmVarunTej & @Itslavanya arriving at Hyderabad airport!!😍#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/BJtp0E1JDQ
— Telugu FilmNagar (@telugufilmnagar) November 4, 2023
ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా సినీ ప్రముఖుల కోసం రేపు అనగా అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఇక ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
View this post on Instagram