Naga Chaitanya – Shobitha : హీరో అక్కినేని నాగచైతన్య సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత మరొక హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలకి అనుగుణంగానే నాగచైతన్య హీరోయిన్ శోభిత దూలిపాలతో కలిసి పలు సందర్భాల్లో కనిపించడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరింది. అయితే ప్రస్తుతం నాగచైతన్య నటి శోభిత దూదిపాలతో రిలేషన్ లో ఉన్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ లండన్ లోని ఓ రెస్టారెంట్ లో జంటగా కనిపించిన సంగతి తెలిసిందే.
AdvertisementView this post on Instagram
ఇలా వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరి గురించి వచ్చే వార్తలు నిజమేనని పెద్ద ఎత్తున ఈ వార్తలను వైరల్ చేశారు. ఇలా వస్తున్న వార్తలు పై శోభిత స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నప్పటికీ తరచూ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి నాగచైతన్య మరియు శోభిత రిలేషన్ లో ఉన్నారంటూ ఓ వార్త ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల వీరిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఫోటోలు మ్యాచ్ అవ్వడంతో ఇద్దరు మరోసారి అడ్డంగా దొరికిపోయారు అంటూ , ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ నేటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే కొన్ని రోజుల క్రితం నాగచైతన్య గ్రీన్ లైట్స్ అనే పుస్తకం గురించి చెబుతూ..
View this post on Instagram
జీవితానికి ఒక ప్రేమ లేఖ అని మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు చాలా థాంక్స్ మీ కథనం మాకు గ్రీన్ లైట్స్ ను నింపింది రెస్పెక్ట్ సార్ అని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అదే పుస్తకాన్ని శోభిత షేర్ చేస్తూ కొన్ని రోజులుగా నేను చదివిన అత్యుత్తమ పుస్తకమని , ఎంతో అపురూపమైన జీవిత కథ , ఎంతో బాగుందని చెప్పుకొచ్చింది. ఇక ఇది గమనించిన నేటిజనులు ఇద్దరు ఒకే పుస్తకం గురించి ఇలా వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం తో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ మరోసారి వీరి గురించి వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఇలా వస్తున్న వార్తలను శోభిత ఇంతకుముందు లాగానే తిరస్కరించుతుందా లేదా వేచి చూడాలి.