Tiger Nageswara Rao : మాస్ మహారాజా రవితేజ ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వాల్తేరు వీరయ్య మరియు ధమాకా వంటి సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదే ఉత్సాహంలో ఉన్న మాస్ మహారాజా మరో కొత్త తరహా సినిమాతో దసరా బరిలో దిగబోతున్నారు. దసరా కానుకగా తన అభిమానులను పలకరించేందుకు మాస్ మహారాజా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు రవితేజ నటిస్తున్న ప్రాజెక్ట్ ఏంటో అందరికీ తెలుసు. అదే టైగర్ నాగేశ్వరరావు.
డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో దసరా కానుక విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారుతాడు అనేది విశేషం. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు సినిమాకు సంబంధించిన టీజర్ మరియు సాంగ్స్ రిలీజ్ అయి ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో రవితేజ భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా 1970 కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు నిజ జీవిత సంఘటనలతో బయోపిక్ గా తీసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇటీవల సినీ బృందం ,సినిమా ట్రైలర్ ను ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన మాస్ మహారాజా ట్రైలర్ ప్రేక్షకుల నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. టైలర్ మాత్రం టీజర్ ను మించి ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ , ఎమోషన్స్ , ఎలివేషన్స్ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాణం పోసి చూపించాయి . అలాగే సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోవడంతో సంక్రాంతి బరిలో రవితేజ దుమ్ము లేపడం ఖాయం అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండిగ్ గా మారింది.