డ్రగ్స్ కేసు – కేపీ చౌదరి కాల్ లిస్టులో అషురెడ్డితోపాటు టాలీవుడ్ తారలు…!!

డ్రగ్స్ కేసులో తన పేరు తెరపైకి రావడంతో ఈ అంశంపై స్పందించింది ఆషూ రెడ్డి. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని…తన వస్తోన్న ఆరోపణలను ఆమె సోషల్ మీడియా ద్వారా కొట్టిపడేశారు.

Advertisement

డ్రగ్స్ కు సంబంధించిన వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. నిరాదర వార్తలు ప్రచురిస్తే ఊరుకోనని అషూరెడ్డి హెచ్చరించారు. తన ప్రమేయం లేకుండా తన ఫోన్ నెంబర్ ను బయటపెడితే ఊరుకునేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అసలు ఇలాంటి నిరాదర వార్తలు ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించింది. ఈ వార్తలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆమె స్పష్టం చేసింది.

Advertisement

కబాలి నిర్మాత కేపీ చౌదరితో ఆమె టచ్ లో ఉందని.. డ్రగ్స్ కోసం వందల కాల్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ విషయం తెరపైకి రావడంతో టాలీవుడ్ లో మళ్ళీ ప్రకంపనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే ఆషూరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఈ అంశంపై ఆమె స్పందిస్తూ తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు టాలీవుడ్ నటి సురేఖ వాణి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె కూడా వందలాది ఫోన్ కాల్స్ కేపీ చౌదరికి చేసిందని అనుమానిస్తున్నారు. కేపీ కాల్ లిస్టులో అషురెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, సురేఖ వాణి ఫోన్ నెంబర్లు ఉండటంతో వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

Advertisement