Telugu Anchors : బుల్లితెరలో ప్రోగ్రామ్స్ చేసే చాలామంది యాంకర్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. వీరంతా తమ స్కిల్స్ తో పైకి వచ్చినవారే. మగవాళ్ళ కంటే మహిళా యాంకర్స్ ఎక్కువగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కొన్ని చానళ్లలో టాప్ యాంకర్స్ గా గుర్తింపు పొందిన వారి పేర్లు వారు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం. తెలుగు పరిశ్రమలో టాప్ యాంకర్ గా సుమా కనకాల కొనసాగుతున్నారు. ఈవిడ పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. అలాగే సినిమాల్లో కూడా నటించగలదు.
Telugu Anchors : బుల్లితెర పై ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్స్ వీళ్లే…
సుమ కనకాల ఇప్పటికీ ప్రతిరోజు వివిధ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూనే మరో ప్రక్క ఆడియో ఫంక్షన్స్ కూడా చేస్తుంటుంది. ఒక్కో ఈవెంట్ కు దాదాపు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం. టాప్ యాంకర్స్ లో జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ రెండో స్థానంలో ఉంది. తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టడంలో అనసూయ ముందుంటుంది. ఈమె ఒక్కో ఈవెంట్ కు దాదాపు రెండు లక్షలు తీసుకుంటుందని తెలుస్తుంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ బాగానే సంపాదించుకుంటుంది.

మరో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఈవెంట్స్ తో పాటు సినిమాలు చేస్తుంటుంది. ఈమో కూడా దాదాపు ఒక్కో ఈవెంట్ కు లక్షన్నర పైన తీసుకుంటుందని టాక్. ఇక కార్తీకదీపం లో వంటలక్క మొన్నటి వరకు కనిపించిన ప్రేమి విశ్వనాధ్ ప్రతి ఎపిసోడ్ కు 30 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఆ సీరియల్ హిట్ కావడంతో ఇప్పుడు ఆమె 50,000 తీసుకుంటున్నట్లు టాక్. అలాగే మరో యాంకర్ శ్రీముఖి కూడా ఒక్కో ఈవెంట్ కు దాదాపు లక్ష వరకు తీసుకుంటుందంట. ఈటీవీ యాంకర్ మంజుషా కూడా ఒక్కో ఈవెంట్ కు 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. యాంకర్ శ్యామల కూడా ఒక్కో ఈ ఈవెంట్ కు 40 నుంచి 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్.