Dil Raju : తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు ఇంట్లో ఇటీవల విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి అయిన శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి ( అక్టోబర్ 9 ) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక ఇప్పటికే శ్యాంసుందర్ వయసు 86 ఏళ్లు కాగా అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఆయన కన్నుమూశారు. ఈ క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీ మూగబోయింది.
తండ్రి మరణంతో దిల్ రాజు కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది.దీంతో సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలుదిల్ రాజు ఇంటికి చేరుకుని వారి తండ్రి శ్యాంసుందర్ రెడ్డి కి నివాళులర్పిస్తున్నారు. దిల్ రాజ్ కు భరోసాగా నిలుస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి , ప్రమీల ను పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ముగ్గురు కుమారులు. వారే విజయ్ సింహారెడ్డి , నరసింహారెడ్డి వెంకటరమణారెడ్డి. ఇక వీరిలో చిన్నవాడైన వెంకటరమణారెడ్డిని ఇంట్లో వారంతా చిన్నతనం నుండే ముద్దుగా రాజు అని పిలిచేవారట. ఇక ఆ పేరుతోనే ఆయన ఇండస్ట్రీలో గుర్తింపు సాధించారు.
అయితే పై చదువుల కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన దిల్ రాజుగా ఇక్కడే స్థిరపడిపోయారు. సినిమాల మీద మక్కువ ఉండటంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారారు. ఇక ఆయన నిర్మించిన మొదటి సినిమా ” దిల్ ” సూపర్ హిట్ అవడంతో అతని పేరు కాస్త దిల్ రాజుగా మారింది. ఇక అప్పటినుండి ఆయనని అందరు దిల్ రాజు అనే పిలుస్తున్నారు . ఇక ఇటీవల దిల్ రాజు గారి తండ్రి శ్యాంసుందర్ చనిపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. శ్యాంసుందర్ రెడ్డి అంతక్రియలను మంగళవారం ఉదయం మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.