Getup Srinu : బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం సుమారుగా 10 సంవత్సరాలు నుండి ప్రసారం అవుతుంది. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయిన కొత్తలో ఇండియాలోనే అత్యధిక టిఆర్పి అందుకున్న కామెడీ ప్రోగ్రామ్ గా రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కొక్క టైంలో బాలీవుడ్ మూవీ మేకర్స్, అలాగే బాలీవుడ్ సీరియల్ మేకర్స్ కూడా ఈ ప్రోగ్రాం టిఆర్పిని చూసి ఆశ్చర్యానికి గురయ్యేవారు. అయితే ప్రస్తుతం ఈ ప్రోగ్రాం పరిస్థితి చాలా చేంజ్ అయింది. అత్యధిక శాతం పలువురు అభిమానులు యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం చూడడం మూలంగా టీవీలో టిఆర్పి తక్కువ వస్తుంది. అయినా సరే మల్లెమాల అలాగే ఈటీవీ వారు తగ్గకుండా ఈ ప్రోగ్రామ్ ని ఇంకా నిర్వహిస్తున్నారు.
జబర్దస్త్ ప్రోగ్రాంలో ప్రముఖులుగా ఉన్న సుడిగాలి సుదీర్ అలాగే హైపర్ ఆది ఈ ప్రోగ్రాం నుండి వెళ్లిపోవడంతో దీనికి టిఆర్పి పూర్తిగా దిగజారిపోయింది అని అంతా అనుకున్నారు. అయితే నిజంగానే వాళ్లు వెళ్లిపోయిన తదుపరి నుండి ఈ ప్రోగ్రాం నీరసపడిపోయింది. దీనిలో ఎగస్ట్రా జబర్దస్త్ తో టిఆర్పి కొద్దిగా ఊపిరి తీసుకుంది. దానికి కారణం గెటప్ శీను రీ ఎంట్రీ. అలాగే రాంప్రసాద్ టీం కి లీడర్ గా వ్యవహరించడం. ఆ టీంలోనే గెటప్ శీను అడుగుపెట్టడం. సుడిగాలి సుదీర్ లేని లోటుని వారిద్దరూ తీరుస్తున్నారు. అలాగే వారి కామెడీ స్క్రిప్ట్లతో అభిమానులను బాగానే అలరిస్తూ ఆదరణ పొందుతున్నారు.
అలాగే టిఆర్పి విషయంలో మళ్లీ అప్పుడు రోజులు వచ్చాయి అంటూ..
Getup Srinu : జబర్దస్త్ షో కి గెటప్ శీను రీ ఎంట్రీ …

ప్రోగ్రాం నిర్వాహకులు, అలాగే జబర్దస్త్ కమెడియన్స్ సంతోషంతో పొంగిపోతున్నారు. ఇకపై ఈ ప్రోగ్రాం మొత్తానికే గెటప్ శీను చేతిలోకి వచ్చింది. అనడంలో అనుమానం లేదు. ఇటీవల లో లోకులు కాకులు ఆంటీ అనే స్క్రిప్ట్ లో వచ్చి గెటప్ శీను ఒక రేంజ్ లో కామెడీ చేసి అందరూ నీ అలరించిన సంగతి తెలిసిందే. గెటప్ శీను ఉంటే జబర్దస్త్ ప్రోగ్రాం మొత్తానికే ఒక ఉత్సాహానికి మారుపేరు అని చెప్పడానికి అనుమానం లేదు. గెటప్ శీను లేని రోజులలో టిఆర్పి తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం గెటప్ శీను అడుగుపెట్టడంతో మళ్లీ ఆ టిఆర్పి తిరిగి వచ్చింది. దాంట్లోఎటువంటి సందేహం లేదు. ఆయన అందుకే చిన్ని తెరపై కమల్ హాసన్ అనే పేరును పొందాడు. ఆ పేరుకి నిజంగానే ఆయన న్యాయం చేస్తున్నాడు అంటూ ప్రేక్షకులు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.