Breaking News : హీరో విజయ్ దేవరకొండ ‘ అర్జున్ రెడ్డి ‘ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమా హిట్ తర్వాత ‘ గీత గోవిందం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ లైగర్ ‘ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాను ఆపేయాలని నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం లైగర్ సినిమాలో పచ్చి బూతు సీన్లు ఉన్నాయని, వీటిని చూస్తుంటే ఎవరికైనా రేప్ చేయాలనిపిస్తుంది అని, ఇది సమాజాన్ని తప్పుదారి పట్టించే అంశంగా ఉన్నాయంటూ కొందరు ట్రోలర్స్ లైగర్ సినిమాను ఆపేయాలని అంటున్నారు. దీంతో పూరి ప్రతిష్టాత్మకంగా తెరపైకి ఎక్కించిన లైగర్ సినిమా ఇప్పుడు ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నట్లు అయింది.
Breaking News : ‘ లైగర్ ‘ సినిమా ఆగినట్లేనా…
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే మరింత హాట్ గా రెచ్చిపోయారు. సినిమాలోని ఓ పాటను చూస్తూ ఆ పాటకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని తీస్తూ నేటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ ఈ సినిమాలో ఏడు సీన్లు కట్ చేయించింది. దీంతో సినిమాలో మంచి సీన్స్ మిస్ అయ్యాయి అని బాధపడుతుంటే కొందరు కావాలనే లైగర్ సినిమాకు మళ్లీ నెగటివ్ టాక్ తీసుకొచ్చేలా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా హిట్ అవడం విజయ్ దేవరకొండ కంటే పూరి జగన్నాథ్ కి ఇంపార్టెంట్. విజయ్ దేవరకొండ స్టైలిస్ట్ యంగ్ హీరో లుక్స్ ఆటిట్యూడ్ ఉన్న మనిషి. ఈ సినిమా కాకపోయినా మరో సినిమాతో అయినా నెట్టుకొస్తాడు.

తర్వాత సినిమా ‘ ఖుషి ‘ బ్లాక్ బస్టర్ హిట్ అవడం పక్క అంటూ ఇప్పటికే కొందరు రివ్యూ చేశారు. కానీ పూరి జగన్నాథ్ పరిస్థితి అలా కాదు. ఈ సినిమా ఫ్లాఫ్ అయితే నెక్స్ట్ ‘ జనగణమన ‘ చూసే దిక్కే ఉండదు. అందుకే పూరి ఎలాగైనా ఈ సినిమాని హిట్ కొట్టాలి. కానీ ఎందుకో తెలియదు ఓ వర్గం లైగర్ సినిమాను మరింత తొక్కేస్తుంది అంటున్నారు సినీ ప్రముఖులు. రీసెంట్ గా ఓ పాటకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. ఈ సినిమాలోని వలగాలారిటీ కన్న వేరే సినిమాలు పచ్చిగా చూపించిన సందర్భాలు ఉన్నాయి. అవి ఏవి గుర్తు రాని జనాలకు లైగర్ సినిమాలోని పాటే గుర్తు రావడం ఏంటో అర్థం కావడం లేదు.