Naresh- Vijayaniramla : వేణు స్వామి వైరల్ కామెంట్స్, నేను ముందే చెప్పా నరేష్ కుటుంబంలో చావు విడాకులు….

Naresh- Vijayaniramla : రాజకీయ ప్రముఖుల మరియు సినీ నటుల జాతకాల గురించి చెప్పే వేణు స్వామి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నటి విజయనిర్మల మరియు ఆమె తనయుడు నరేష్ యొక్క మూడో భార్య రమ్య రఘుపతి గురించి సంచలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈయన చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటుడు నరేష్ మరియు ఆయన భార్య రమ్య రఘుపతి గురించి మాట్లాడుతూ నేను కృష్ణ గారికి అభిమానిని మరియు నేను నా చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ఇంట్లో పూజలు చేస్తూనే ఉన్నాను.

Advertisement

వారింట్లో పూజలు చేసే సమయంలో జాతకాలు కూడా చెప్పేవాడిని అని చెప్తూ, 2014 సమయంలో కృష్ణ మరియు విజయనిర్మల గారి జాతకాలు చూసి 2020 లో కృష్ణ మరియు విజయనిర్మల వారి గురించి మీ ఇద్దరిలో ఒకరు మరణిస్తారని చెప్పాను అని ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న విజయనిర్మల గారు కొంత భయభ్రాంతులకు లోనవటం జరిగింది కానీ భయపడడం అనేది తన ఉద్దేశం కాదని ఉన్న విషయమే చెప్పాను అని దానికి కావలసిన పరిహారం చేస్తే బాగుంటుందని వారి ఇరువురికి ముందుగానే చెప్పడం జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి.

Advertisement

Naresh- Vijayaniramla : వేణు స్వామి వైరల్ కామెంట్స్

venu swami sensational comments on naressh and vijaya niramal
venu swami sensational comments on naressh and vijaya niramal

ఎప్పుడైతే కృష్ణ విజయనిర్మలలో ఒకరు చనిపోతారని నేను చెప్పాను అప్పుడు నుంచి వాళ్లు నన్ను దూరం పెట్టారని వివరించాడు. అప్పుడు జరిగిన ఆ సంఘటన నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం మానేశానని తెలిపారు. ఆ సమయంలో నరేష్ గారు కూడా అక్కడ ఉండడంతో ఆయన నాకు నన్ను ఎందుకిలా చెప్పారని అడిగారు. దానికి బదులుగా నాకు ఇష్టమైన వ్యక్తులు బాగుండాలని సదుద్దేశంతోనే ఇలా చెప్పానని నరేష్ తో చెప్పానని అనడం జరిగింది. అదే ఏడాదిలో రమ్య రఘుపతి మరియు నరేష్ జాతకాలు చూడడం జరిగిందని చెప్తూ, నరేష్ యొక్క జాతకం రమ్య రఘుపతి జాతకం కలవలేదని, వారి ఇరువురు విడిపోతారని సంగతి ముందే నరేష్ కి వివరించానని చెప్పాడు.

వారింట్లో జరిగిన వ్రతాన్ని మరియు ఆవ్రతానికి సంబంధించిన ముహూర్తం పెట్టిన సమయంలో నేను వాళ్ళ విడాకులు మరియు జాతకాల గురించి వివరించిన వారు వినలేదని ఆయన తెలియజేశారు. ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇంకా వివరిస్తూ ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అంటూ కానీ వారి జీవితం లో జాతకాలు కలవకపోయినా నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నారని పెళ్లి చేసుకుంటే విడిపోతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ వివరణ ఇచ్చారు. ఈ రెండు విషయాలు నేను ముందుగానే వారికి తెలియజేయడంతో వారు నన్ను దూరం పెట్టారని అప్పటినుంచి వారింటికి వెళ్లడం మానేశానని కానీ నేను చెప్పిన ఈ రెండు విషయాలు నిజమయ్యాయని అన్నారు.

Advertisement