Vijay Devarakonda : ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ను పెంచుకొని దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ పేరుని ఫాన్స్ జపం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ హీరో చేసిన మూవీలు చాలా తక్కువ. దాన్లో బ్లాక్ బాస్టర్ అయిన మూవీలు చాలా తక్కువ. అయితే చేసిన రెండు మూడు మూవీలు మాత్రం తన కెరీర్ మార్చి పడేసాయి.. అలాగే కుర్రకారులు న్యూ ఫార్ములాను క్రియేట్ చేసి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా చేస్తున్నాడు. ఈ హీరో అర్జున్ రెడ్డి మూవీ తో తన లైఫ్ నీ తానే మార్చుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం లైగర్ మూవీ తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ పెంచుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీ హీరోయిన్ అనన్య పాండే, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ జతకట్టి చేస్తున్న మూవీ లైగర్ ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకులు భారీగా అంచనాలను వేసుకున్నారు.
25 ఆగస్టు న ఈ మూవీ విడుదల అవ్వబోతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ పనులు విజయ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. తన ఆటిట్యూడ్ తో, తన స్టైల్ తో, తన ప్రౌడ్ తో తన మాట తీరుతో నిత్యం సినీ పరిశ్రమ లో సెన్సేషన్ ట్రెండు అవుతున్నాడు ఈ హీరో. లైగర్ ప్రమోషన్లు ఎపిసోడ్ ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యి మన హీరో విజయ్ అనుకోకుండా స్టార్ సన్స్ పై కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాన ఛానల్ లో ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు విజయ్. తన నిజ జీవితం గురించి, అలాగే తన తెర జీవితంలో పడ్డ కష్టాలను తెలియజేశాడు. దీని నేపథ్యంలో విజయ్ మాట్లాడుతూ నాకు టోటల్గా నేను ఎవరో తెలీదు.. అయితే నాకు మాత్రం ఒకటి పక్కాగా తెలుసు.
Vijay Devarakonda : స్టార్ సన్స్ పై సెన్సేషన్ వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ.

నాకు ఎట్లా చేయాలనిపిస్తే అలానే చేస్తా.. నాకు ఏది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడుతా… నాకు నచ్చినట్టే నేను ఉంటా.. అది నాకు ఇష్టం అన్నిట్లో కల్ల ముఖ్యం మన జీవితం మనకు నచ్చినట్టుగా లేకుండా మనకు నచ్చినట్లు జీవించకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వేస్ట్. స్టార్ హీరో అవ్వడం వల్ల ఏం లాభం ఉంటది. ఎన్ని ఆస్తులు సంపాదించిన ఏం ప్రయోజనం ఉంటుంది. అంటూ.. తను వ్యాఖ్యలు తెలియజేశాడు. దాంతో విజయ్ పలువురు స్టార్ హీరో తనయులని టార్గెట్ చేశాడు. అంటూ పలువురు విజయ్ సినీ పరిశ్రమలు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నెట్టింట ఆయన స్టార్ అనే వర్డ్ ముచ్చటించడమే సెన్సేషన్ గా మారింది.