Vijay Sethupathi : ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అగ్ర కథానాయకుల జాబితాలో విజయ్ సేతుపతి ఒకరు. దాదాపు 50 కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మోగిస్తున్న జవాన్ సినిమా లో సేతుపతి విలన్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ త్రిల్లర్ డ్రామా లో నయనతార మరియు దీపిక పదుకునే నటించారు. ఇక ఈ సినిమాలో సేతుపతి వ్యాపారి కాళీ గైక్వాడ్ పాత్రలో నటించి మెప్పించారు . అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతి తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, మరియు ఆయన ప్రేమ పెళ్లి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అయితే విజయ్ సేతుపతి తన నటన జీవితం ప్రారంభించక ముందు అకౌంటెంట్ గా పనిచేసేవారట. 2000 నవంబర్ లో ముంబైలో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన తర్వాత విజయ్ అకౌంటెంట్ గా పని చేసేందుకు దుబాయ్ వెళ్లారు.ఇక ఆ సమయంలో అతను జీతం 12000 . విజయ్ సేతుపతి తన సతీమణి జెస్సిని చూడకుండానే ప్రేమించాడు. దుబాయిలో పనిచేస్తున్న సమయంలో తన భార్య జెస్సి కూడా దుబాయ్ లో ఉండేదని , ఫేస్ బుక్ చాటింగ్ ద్వారా తాము స్నేహితుల అయ్యమని సేతుపతి చెప్పుకొచ్చాడు. అనంతరం ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే వీరిద్దరూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకునేవారు కానీ ఒకరిని ఒకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నారట.
ఇక ప్రస్తుతం భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న జవాన్ చిత్రానికి గాను విజయ్ సేతుపతికి దాదాపు 21 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్నెస్ డైటింగ్ అనే విషయాలను ఎక్కువగా పట్టించుకోనని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు ఎప్పుడు ముందుంటానని సేతుపతి చెప్పుకొచ్చాడు. అంతేకాక రుచికరమైన ఆహారాన్ని తినలేకపోతే జీవితం వ్యర్థమని ఆయన తెలిపారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సేతుపతి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.