Vishwak Sen : ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ బందు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అగ్ర హీరోల సినిమాలు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కానీ ఇతర భాష సినిమాలు చిన్న సినిమాలు షూటింగులు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 16 చిన్న సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటికి ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తూనే ఉంది. కమిటీల తీర్మానం ప్రకారం వీటికి ఎలాంటి అడ్డంకి లేదు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన ఓన్ బ్యానర్లో ఒక మూవీ చేస్తూ ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ సేట్ ని ఫైట్ షూట్ కోసం దాదాపు 70 లక్షల వ్యయంతో నిర్మించారని తెలియ వచ్చింది. అయితే ఈ ప్లానింగ్ అంతా పగడ్బందీ గానే ఉంది.
రావు రమేష్ గారితో చేస్తున్న ఈ షూటింగ్ బల్గేరియా ఫైటర్లతో ప్లాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ షూటింగ్ పూర్తి చేసుకొని రావు రమేష్ గారు ఊటీ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. అనుకున్న ప్రకారమే ఈ సినిమా షూటింగ్ కి బృందావనం అంతా ప్లాన్ చేసింది. అకస్మాత్తుగా గిల్డ్ బృందంలోని ఓ సభ్యుడు ఫోన్ చేసి షూటింగు ఆపాలి అన్నట్లుగా బెదిరించడం జరిగింది. గిల్డ్ లోని ఓ సభ్యుడు సభ్యురాలు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్టు సమాచారం. బయటనుంచి వచ్చిన వారిని హెచ్చరించి షూటింగ్ ను ఆపినట్లుగా తెలుస్తుంది. దీంతో చిత్ర నిర్మాతలు అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలియ వచ్చింది.
Vishwak Sen : ఇదెక్కడి రూల్ అండి షూటింగ్ చేస్తే బెదిరిస్తారా? 
ViswakSen threted by gild member at his movie shootingఅసోసియేషన్ అన్నది సినిమా నిర్మాతల క్షేమం చూడకపోగా ఇలా బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని కౌన్సిల్ నేత సి. కళ్యాణ్ కి బాధని తెలిపినట్లు సమాచారం. ఈయన ఈనెల 18న షూటింగ్ చేసుకోనెలా వెసులుబాటు కల్పించాలని కోరినట్లుగా సమాచారం. ఈ క్రమంలో విస్వక్ సేన్ కు బెదిరింపు కాల్స్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాని ఎలా చేస్తారో? అని బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో మిగతా సినిమాలన్నీ వదిలేసి విశ్వక్సేన్ సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది అందరికీ అనుమానంగా ఉంది. ఇందులో ఏదైనా వ్యక్తిగత కారణం ఉందా అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి గిల్ట్ సభ్యురాలి బెదిరింపులు వాస్తవమా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.