Amit Shah – NTR : గత రెండు రోజుల నుంచి ఇదే న్యూస్ మెయిన్ మీడియా, సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మునుగోడు సభకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా.. అసలు బీజేపీతో కానీ.. మునుగోడుతో కానీ సంబంధం లేని ఒక సినీ స్టార్ ఎన్టీఆర్ ను కలవడం ఏంటంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. మునుగోడు సభకు అమిత్ షా రాకముందే వీళ్ల భేటీ గురించి అంతటా చర్చనీయాంశమైంది. అసలే యంగ్ టైగర్, ఆర్ఆర్ఆర్ సినిమాతో తన రేంజ్ ను ఒక్కసారిగా పెంచుకున్న హీరో కావడంతో అమిత్ షా లాంటి వ్యక్తి.. జూనియర్ ను ఎందుకు కలిశారు అనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

అయితే.. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ కంటే ముందు.. జూనియర్ ఎన్టీఆర్ కు రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకోవాలి. జక్కన్న తను తీసిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు తీసింది జూనియర్ తోనే. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్. ఈ నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కు ఆస్కార్ రేంజ్ పాపులారిటీని ఇచ్చింది.
Amit Shah – NTR : ఎన్టీఆర్, రాజమౌళి మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించేందుకేనా?
అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో క్లయిమాక్స్ లో ఎక్కువ స్పేస్ రామ్ చరణ్ కు ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ కు తక్కువ స్పేస్ ఇచ్చారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కూడా వచ్చిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఈనేపథ్యంలోనే ఆ గ్యాప్ ను తగ్గించేందుకే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. తారక్ తో అమిత్ షా భేటీ అయ్యేలా చేశారట.
ఇటీవలే విజయేంద్రప్రసాద్.. రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చింది. ఈ భేటీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో కొంత ప్లస్ అవుతుంది. దేశవ్యాప్తంగా అమిత్ షా, తారక్ భేటీ చర్చనీయాంశం అవుతుంది కాబట్టి.. మునుగోడు ఉపఎన్నికల కోసం తెలంగాణ వచ్చినప్పుడే అమిత్ షాతో తారక్ భేటీకి ప్లాన్ చేశారట విజయేంద్రప్రసాద్. ఒకవేళ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్.. బీజేపీలోకి వెళ్లాలనుకున్నా పెద్ద కష్టం కాదని.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. అందుకే రాజమౌళి తన తండ్రిలో ఈ భేటీని ఏర్పాటు చేయించారని చెబుతున్నారు.
అంతే కాదు.. ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక మరో సినిమా తారక్ తోనే ఉండబోతోందట. అందుకే.. తారక్ తో కలిసిపోయేందుకు జక్కన్న ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.