Sundharakanada Heroin Aparna : విక్టరీ వెంకటేష్ చేసిన సినిమాలలో అందరికీ గుర్తుండిపోయే సినిమా సుందరకాండ అని టక్కున చెప్పొచ్చు. అంతలా ఆకట్టుకున్న సినిమాలో ప్రతి ఒక్కరూ యాక్టింగ్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ మరియు మీనా ఇంకా సెకండ్ హీరోయిన్ గా అపర్ణ చేయడం జరిగింది. అయితే వెంకటేష్ విషయానికొస్తే ఆయన పేరుకు తగ్గట్టుగానే ప్రతి సినిమా విక్టరీ ఆయన సొంతంగా అనిపిస్తుంది. డాక్టర్ డి రామానాయుడు కొడుకు అయినటువంటి వెంకటేష్ ఎక్కడ కూడా తన బ్యాక్ గ్రౌండ్ కి సంబంధం లేకుండా పక్క పల్లెటూరి వ్యక్తిలా యాక్టింగ్ చేస్తూ తన కెరియర్లో చాలా సిక్సస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు.
Sundharakanada Heroin Aparna : సుందరకాండ సినిమాలో హీరోయిన్ గా చేసిన అపర్ణ ఎవరి మేనకోడలో మీకు తెలుసా…
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసినటువంటి సుందరకాండ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. మొదట ఈ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ పాత్ర చేస్తుండగా తనకి సూట్ అవ్వదని చాలామంది ఆ పాత్ర చేయవద్దని అన్నారట. అయితే సుందరాకాండ సినిమ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన నటన చూసి అందరూ అవాక్కయ్యారట. అంతలా ఈ సినిమాలో వెంకటేష్ తన పాత్ర లో జీవించాడని చెప్పొచ్చు.

సుందరాకాండ సినిమాలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన అపర్ణ క్యారెక్టర్. వెంకటేష్ స్టూడెంట్ క్యారెక్టర్ గా చేసి తన లెక్చరర్ని ప్రేమించిన అల్లరి అమ్మాయి పాత్రలో అపర్ణ అద్భుతంగా నటించింది. ఈమె ఈ సినిమాలో ఎలా అవకాశాన్ని సంపాదించిందంటే. ఈ సినిమా నిర్మాత అయినటువంటి కెవివి సత్యనారాయణ ఇంటికి ఓరోజు రాఘవేంద్రరావు వెళ్లారట. అక్కడ అపర్ణని చూసి స్టూడెంట్ క్యారెక్టర్ గా సూట్ అవుతుందని తన మనసులో అనుకున్నారట.
అయితే ఈ విషయాన్ని రాఘవేంద్రరావు గారు ఎవరికీ చెప్పలేదు. అయితే ఈ సినిమా ఆడిషన్స్ కోసం ఒకరోజు అపర్ణ రావడంతో ఆమె కెవివి సత్యనారాయణ గారి మేడగూడదు అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగా ఆమెకు రాఘవేంద్రరావు వెంటనే ఓకే చెప్పేసారంట. అయితే ఆమెకి యాక్టింగ్ వచ్చా రాదా అనే విషయంలో డైరెక్షన్ టీం చాలా భయపడినప్పటికీ ఆమె అద్భుత నటనతో అందరినీ ఆకర్షించటం తో పాటు ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంది. దీనికిగాను అపర్ణాకి మంచి గుర్తింపు వచ్చింది. 2002 లో ఈమె వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది.