Ali – Pawan Kalyan : అలీ, పవన్ కళ్యాణ్.. గత రెండు మూడు రోజుల నుంచి వీళ్ల గురించే చర్చ. అలీ కూతురు ఫాతిమా పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇద్దరూ సన్నిహితులు. మరి.. అంత సన్నిహితుల మధ్య ఏం జరిగింది అంటూ చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా అలీ కూతురు పెళ్లికి హాజరయ్యాడు. మరి.. పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదు అనేదే అంతుపట్టని అంశం. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ ఖచ్చితంగా ఉంటాడు. అలీ, పవన్ మధ్య ఉన్న బంధం అటువంటిది.

కానీ.. ఈ మధ్య అది చెడిందా? అనేది ఇప్పుడు సుస్పష్టమవుతోంది. ఇన్ని రోజులు వాళ్ల మధ్య నిజంగా విభేదాలు ఉన్నాయో లేదో తెలియలేదు కానీ.. ఇప్పుడు అలీ కూతురు పెళ్లికి రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమయింది. కేవలం రాజకీయాల వల్లనే.. అలీ.. వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం, పార్టీలో చేరడం వల్లనే పవన్ తో అలీకి విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
Ali – Pawan Kalyan : సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన అలీ
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా అలీ స్పందించాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుండగా నేను వెళ్లి పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా యూనిట్ అందరినీ నేను ఇన్విటేషన్ కార్డు ఇచ్చాను. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పెళ్లికి వస్తా అన్నారు. కానీ.. ఆయన పెళ్లి వచ్చే సమయంలో ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో రాలేకపోయారు. తాను పెళ్లికి రాలేకపోయినందుకు ఫోన్ చేసి కూడా మాట్లాడారు. కూతురు, అల్లుడు ఇంట్లో ఉన్నప్పుడు చెబితే తాను వస్తా.. ఆశీర్వదించి వెళ్తా అని కూడా చెప్పారు అని మీడియాతో మాట్లాడిన అలీ చెప్పుకొచ్చారు. మొత్తానికి అలీ, పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అలీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు పుల్ స్టాప్ పెట్టేశారు.