Health Tips : అరటిపండు అంటే పిల్లల నుండి పెద్దల దాకా చాలా ఇష్టపడతారు. ఈ పండు అన్ని సీజన్లో లభిస్తుంది. అందరికీ అందుబాటు ధరలో ఉండి, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలగజేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది. ఇవే కాకుండా అరటి పండులో మంగనేష్, మెగ్నీషియంతో పాటు విటమిన్ బి6 అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా మక్కువే.అయితే కొంతమందికి అరటిని నేరుగా తినడం ఇష్టం ఉండదు. పెరుగన్నంలో పెట్టుకొని తినడం, పాలల్లో చక్కెర వేసుకొని కలుపుకొని తాగడం, చేసుకుంటా రకరకాల షేక్ లు తయారు చేసుకుని తాగడం వంటివి చేస్తుంటారు.
ఈ పండు ఎముకలు ,కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అధిక కాల్షియం కలిగి ఉండి నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మరి, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అరటిని, పాలను కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.అయితే, ఈ రెండిటినీ విడివిడిగా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాలు తాగిన 15 నిమిషాల తర్వాత అరటిపండు తినవచ్చు. ఈ పండు మిల్క్ షేక్ లు రోజు తాగితే జీర్ణక్రియ పై ప్రభావం ఏర్పడుతుంది. బాడీ బిల్డర్లు అరటిపండు, పాలు కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
Health Tips : అరటి ,పాలు ఈ రెండింటిని కలిపి తింటున్నారా? అయితే ఏం జరుగుతుందంటే.

బరువు పెరగాలనుకున్న వాళ్లు కూడా పాలు అరటిపండు కలిపి తీసుకోవచ్చు. అయితే ఆస్తమా వంటి ఎలర్జీలతో బాధపడేవారు మాత్రం ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకోకూడదు. కఫం పట్టి శ్వాస సంబంధిత ఇబ్బందులకు దారితీస్తుంది. అని చెప్పకు వచ్చారు ఆరోగ్య నిపుణులు. కొన్ని విరుద్ధ లక్షణాలు కలిగిన ఆహారాలు కలిపి తీసుకుంటే జీర్ణ ప్రక్రియ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. అటువంటి వాటిలో అరటిపండు ఒకటి. నిజానికి పండుతో పాలు కలపడం ఆరోగ్యానికి మంచిది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై పరిశోధనలో ప్రకారం ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ సూర్య భగవతి మాట్లాడుతూ… అరటిపండు పాలు కలిపి తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. దీని ప్రభావం వల్ల కొంతమందికి వాంతులు, విరోచనాలు అవుతాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. అంతేకాకుండా దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొందరు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటి, పాలు కలిపి తింటే వచ్చే లాభాలు కంటే నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. వీటి రెండింటిలోనే పోషకాలు అధికంగానే ఉంటాయి కానీ, వీటిని విడివిడిగా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు