Dark Circles : సహజంగా అందరూ అందంగా, యవ్వనంగా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వలన ఎంగేజ్ లో కూడా ఓల్డ్ ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఆడ ,మగ, చిన్న ,పెద్ద తరహా లేకుండా చాలామందిలో సౌందర్యం సమస్యల్లో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు యుక్త వయసులో కూడా ముసలి వారిలాగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సమస్య ఎలా తొలగించుకోవాలో తెలీక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకి కొన్ని కారణాలు ఉంటాయి. అవి ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి లో మంచి ఆహారం తీసుకోవడం వలన, సరియైన నిద్ర వలన ఈ సమస్య దరిచేరకుండా ఉంటుంది. అలాగే కొన్ని చిట్కాలతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.. వంటింట్లో ఉండే తులసి, అల్లం లాంటి సాధారణమైన మెడిసిన్ తో డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు.. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఇప్పుడు అది ఎలాగో చూద్దాం…
గుప్పెడు వేరుశనగలు, కాస్త కొబ్బరి, కొంచెం బెల్లం కలిపి నిత్యము సాయంత్రం వేళలో తీసుకోవాలి. దీనిని నిత్యము స్నాక్ లాగా తీసుకుంటూ ఉంటే ఈ బ్లాక్ సర్కిల్స్ తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే అల్లం, తులసి, కుంకుమపువ్వు వీటితో టీ తయారు చేసుకొని అందులో తగినంత తేనెను కలిపి రోజుకి ఒకసారి తీసుకోండి. ఈ టీ లో ప్రతి పదార్థం చక్కని ఆరోగ్య ఉపయోగాలను అందజేస్తాయి. ఇలా రోజుకి ఒకసారి తీసుకోవడం వలన ఈ నల్లటి వలయాలు తగ్గిపోతాయి. అలాగే నల్లటి వలయాలను నివారించడానికి ఇంట్లోనే ప్యాక్ కూడా తయారు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం… ఫ్రెష్ పాలను, సెనగపిండి కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకుని ఆ మిశ్రమాన్ని తర్వాత ఫేస్ కి, ఒంటికి వాడుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్న తర్వాత సబ్బు వాడవద్దు. ఈ ఇతర కెమికల్స్ సబ్బులను వాడకపోవడం మంచిది.
Dark Circles : కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా… అయితే మీకోసం ఈ చిట్కాలు…

అదేవిధంగా ఈ సమస్యలు సరియైన నిద్ర లేకపోవడంతో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఒక 30 నిమిషాల పాటు పడుకోవాలి. మధ్యాహ్నం సమయంలో 30 నిమిషాలకు మించి అధికంగా నిద్రపోవద్దు. అదేవిధంగా నైట్ 11 లోపే నిద్రించాలి. ఇలా చేయడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది. అలాగే అతిగా నిద్రించడం వలన కూడా ఈ బ్లాక్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కావున అధిక నిద్ర మంచిది కాదు. అలాగే మొబైల్స్ టీవీ ఎలక్ట్రానిక్ వస్తువులు వలన కళ్ళకి ఒత్తిడి కలుగుతుంది. దానివలన మీ కళ్ళ చుట్టూ రక్త కణాలను ఉబ్బి అక్కడి చర్మం నల్లగా అవుతుంది. కాబట్టి మీ కళ్ళకి తగినంత రెస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కువ నీటిని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.