Irregular Periods : పీరియడ్స్ కోసం మందులు వాడుతున్నారా….తస్మాత్ జాగ్రత్త…

Irregular Periods : ప్రతి ఆడపిల్ల తన జీవితంలో రుతుక్రమం అనే దానిని తప్పనిసరిగా ఎదుర్కోవాలి. యుక్త వయసుకు వచ్చాక ప్రతి ఆడపిల్లలో నెలనెలా పీరియడ్స్ రావడం అనేది సర్వసాధారణం. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఆడపిల్లలు సకాలంలో పీరియడ్స్ రాకపోవడం వలన పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే బ్లీడింగ్ సరిగా కాకపోవడం వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. దీంతో అసలు ఈ సమస్యకు కారణం తెలియకుండానే చాలామంది వివిధ రకాల మందులను వాడుతున్నారు. ఇలా వాడడం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అసలు పీరియడ్స్ అనేవి సరైన సమయానికి ఎందుకు రావు…?దానికి గల కారణాలేంటి…?ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

are-you-using-medicines-for-periods

Advertisement

అయితే స్త్రీలలో ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ కారణంగా శరీరంలో హార్మోన్ అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. దీని కారణంగా పిసిఒడి వంటి ఆరోగ్య సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలుు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే వీటికోసం వివిధ రకాల మందులను వాడాల్సి వస్తుంది. దీని కారణంగా చాలామంది స్త్రీలు బరువు పెరుగుతుంటారు. ఇక బరువు పెరగడం వలన పీరియడ్ సమస్యలు కూడా మరింత తీవ్రమవుతాయి. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి బరువు పెరగడం కారణమని నిపుణులు చెబుతున్నారు. మహిళలు బరువు పెరగడం వలన రుతుక్రవం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎక్కువగా మందులను ఉపయోగించడం మంచిది కాదని సూచిస్తున్నారు.అలాగే సమయానికి తిండి తినకపోవడం సరిగా నిద్రపోకపోవడం , జీవనశైలిలో పలు రకాల మార్పులు రావడం వలన కూడా పీరియడ్స్ సక్రమంగా జరగవట. అందుకే వీటిని తప్పక పాటించడం వలన ఈ సమస్యల నుండి బయటపడవచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు.

are-you-using-medicines-for-periods

అలాగే మహిళలలో పొట్ట చుట్టూ ఉండే కొవ్వును మిసరల్ ఫ్యాట్ అంటారు. శరీరంలో ఇది ఎక్కువగా ఉండటం వలన ఇన్సులిన్ సరిగా పనిచేయదు. దీని కారణంగా అండం విడుదల కాదు. వీటన్నిటి కారణంగా నెలసరి అనేది సక్రమంగా జరగదు. ఇక ఈ నెలసరిని సరి చేసేందుకు చాలా మంది హార్మోన్ మాత్రలు వాడాల్సి వస్తుంది.అయితే ఈ సమస్య నుండి బయట పడాలంటే మహిళల చేతుల్లోనే ఉంటుంది. మీరు అధిక బరువును కలిగి ఉన్నట్లయితే వెంటనే బరువు తగ్గడానికి ట్రై చేయండి. అలాగే సరైన సమయానికి మంచి ఆహారాన్ని తీసుకుంటూ సరైన సమయానికి నిద్రపోతూ రోజువారి వ్యాయామం చేయండి. అలాగే స్వీట్లు చక్కెర ,వేపుళ్ళు, పచ్చళ్ళు వంటి ఆహార పదార్థాలను ,కాస్త తక్కువగా తినడం మంచిది. అలాగే ప్రతిరోజు ఉదయం కాసేపు నడవడం అలవాటు చేసుకోండి. ఇవన్నీ చేయడం ద్వారా రుతుక్రమంలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. అలాగే పిరియడ్స్ లో వచ్చే పెయిన్ కూడా చాలా వరకు తగ్గుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించా. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement