Cardamom : మన వంటింటిలో స్థానం సంపాదించుకున్న కొన్ని మసాలా దినుసులు లో యాలకులు ఒకటి. ముఖ్యంగా నోటి దుర్వాసన పోగొట్టడంలో యాలకులు కీలక పాత్ర వహిస్తాయి. వీటిని సువాసన ద్రవ్యంగా మిఠాయిల్లో ఉపయోగిస్తారు. కానీ శరీరానికి అల్లం ఎంత మేలు చేస్తుందో యాలకులు కూడా అంతే మేలు చేస్తాయి. యాలకులు కాలేయం, గుండె భాగాలకు టానిక్ లాగా పని చేస్తుంది. అంతేకాకుండా మానసిక సమస్యతో బాధపడే వారిని ఆ స్థితి నుండి బయటపడేసేందుకు యాలకులు ద్రోహత పడతాయి.
సీజనల్ అనారోగ్య సమస్యలైనా దగ్గు ,జలుబు, జ్వరం వంటి వ్యాధులను దూరం చేయడానికి యాలకులు ఉపయోగపడతాయి. వాంతులు, వికారం వంటి సమస్యల నుండి యాలకులతో ఉపశమనం లభిస్తుందట. ఆరోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడి అనారోగ్య సమస్యలను నయం చేయడంలో యాలకులు సమర్థవంతంగా పనిచేస్తాయట. రక్తపోటు, కొలెస్ట్రాల సమస్యలు ఉన్నవారు యాలకులను తీసుకోవడం మంచిది. గొంతు తరిబారిపోవడం, ప్లూ వంటి సమస్యలను యాలకులతో నివారించవచ్చు.
Cardamom : యాలకులు రోజు రెండు తింటే చాలు….

పుచ్చ గింజలతో కలిపి యాలకులను తీసుకోవడం ద్వారా కిడ్నీలలోని రాళ్ళను కరిగించవచ్చు. కొన్ని ఆయుర్వేదిక్ పరిశోధన ద్వారా టీ పొడిలో యాలకుల పొడి వేసి కలిపి వాడితే, మూత్రం సాఫీగా ఉంటుందని రుజువయింది. అంతే కాదు సెక్స్ సమస్యలతో బాధపడే పురుషులు యాలకులు నూనెను వాడితే మంచి ఫలితం లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న యాలకులను నేరుగా తీసుకోవడం కొంచెం కష్టం అనిపించినా టీ, కాఫీ పొడిలో కలిపి తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.