Korralu Benefits : మనం రోజు తీసుకునే ఆహారం మన శరీరానికి అన్ని విధాలుగా మేలు చేసేదిగా ఉంటేనే దాని ద్వారా మనం శక్తిని పొందగలుగుతాం. అయితే శరీరానికి శక్తిని అందించడంతోపాటు వివిధ రకాల పోషకాలను అందించే కొర్రలు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. కడుపునొప్పి అరుగుదల వంటి సమస్యలకు కొర్రలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఈ కొర్రలను రాత్రి నిద్రించే ముందు శుభ్రం చేసుకుని నీటిలో నానబెట్టి ఉదయం తగినన్ని నీటిలో ఉడికించుకోవాలి. అలాగే దీనిలో కాస్త ఉప్పు కాస్త పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకొని తాగవచ్చు. కుదిరితే దీనిలో పెరుగు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా దీనిని తీసుకోవటం వలన శరీరానికి శక్తితో పాటు వివిధ రకాల పోషకాలు అంది చాలా ఆరోగ్యంగా ఉంటారు.
అయితే నేటి కాలంలో బియ్యం ఎక్కువగా పాలిష్ చేయడం వలన దాంట్లో ఉండే పోషక విలువలు తగ్గిపోతున్నాయి. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ సమస్యలను అధిగమించేందుకే చిరుధాన్యాలను తింటూ ఉండాలి. దీనిలో భాగంగానే చిరుధాన్యాలుగా పిలవబడే కొర్రలను బియ్యం వండుకున్నట్లుగానే వండుకొని తీసుకోవచ్చు. అంతేకాక దీనిని ఆహారంగా తీసుకోవడం వలన అధిక బరువు కలవారు ఇట్టే బరువు తగ్గుతారు. అలాగే కొర్రలు తీపి మరియు వగరు రుచిని కలిగి ఉంటాయి.
అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక కొర్రలు అత్యధికంగా పీచు పదార్థం ,మాంసకృతులు, కాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ కొర్రలను ఆహారంగా తీసుకోవడం వలన ఉదర సంబంధిత వ్యాధులకు కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపునొప్పి, మూత్రంలో మంట ఆకలి లేకపోవడం, అతిసారం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అలాగే కొర్రలను ప్రతిరోజు తినేవారిలో క్యాన్సర్ వచ్చే సూచనలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో వెళ్లడైంది. అదేవిధంగా కొర్రలు రక్తహీనతను కూడా తగ్గిస్తాయి.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది.యువతరం దీనిని ధ్రువీకరించలేదు.