Sabudana Health Benefits : సగ్గుబియ్యం అంటే అందరికీ తెలుసు. పండగ సమయంలో వీటితో రకరకాల వంటలు తయారు చేస్తారు. వీటిని కర్ర పెండలం దుంపలతో తయారుచేస్తారు. ఈ బియ్యంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ,విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. రోజు సగ్గుబియ్యం తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక మీరు వదిలిపెట్టారు. వీటిని ఎలా తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యాన్ని పాలల్లో ఉడికించి బెల్లం కలిపి పాయసం తయారు చేసుకుని తాగవచ్చు. మరికొందరు సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకొని మజ్జిగలో కలుపుకొని తాగుతుంటారు. రోజు వీటిని తినడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. విరోచనాలు అయిన తరువాత అలసట, నీరసం నుండి బయటపడడానికి ఈ సగ్గుబియ్యాన్ని తీసుకుంటే తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
Sabudana Health Benefits : మానవ సత్తువ పెంచే సగ్గుబియ్యం పాయసం తాగినట్లయితే….

అధిక బరువు తగ్గాలనుకునే వారికి వీటిని చక్కటి ఆహారంగా ఉపయోగించుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని ఉప్మా, కట్ లెట్ గా తయారు చేసుకుని తీసుకోవచ్చు. వీటిలో స్టార్చ్ శాతం అధికంగా ఉంటుంది. ఇవి తీయటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడే వారిని వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో సుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. ఈ బియ్యంలో పోలిక్ యాసిడ్ విటమిన్ బి ఉంటాయి. వీటిని గర్భిణీలు తింటే పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
సగ్గుబియ్యం లో ఐరన్ ,క్యాల్షియం ,విటమిన్ కే లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి రక్తపోటు సమస్యలను ,రక్తస్రావాన్ని కంట్రోల్ చేస్తాయి. ఎసిడిటీ, జీర్ణవ్యవస్థకు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి కావాల్సిన శక్తిని చేకూరుస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే రక్తం లేని సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా శరీరంలో ఉన్న అధిక వేడిని కూడా తగ్గిస్తాయి