Health : శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే వంటగదిలో ఉండే ఈ ఒక్క పదార్థం… మంత్రంలా పనిచేస్తుంది!!

Health :  ప్రతి వంటింట్లో ఉండే నల్లమిరియాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. సుగంధ ద్రవ్యాలలో నల్లమిరియాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని మనదేశంలో ఒకప్పుడు బాగా పండించేవారు. నల్ల మిరియాల లో విటమిన్ ఎ, సి, కె తో పాటు మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నల్ల మిరియాలు శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగిస్తాయి. కొత్త ఫ్యాట్ సేల్స్ ఉత్పత్తి అవ్వకుండా చూస్తాయి. కొంచెం ఘాటుగా ఉన్న తినగలిగిన వారు రోజు రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలో మెటబాలిజం క్రమబద్ధం చేస్తుంది. రోజు టీ లో చిటికెడు మిరియాల పొడి వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు స్పూన్ మిరియాల పొడిని కలిపి తాగితే మంచిది.

Advertisement
Black pepper reduce the bad cholesterol in our body
Black pepper reduce the bad cholesterol in our body

రోజు తినే ఆహారంలో వంటగదిలో ఈజీగా దొరికే నల్లమిరియాలను ఉపయోగిస్తే అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. నల్లమిరియాలతో ఎన్నో లాభాలు ఉన్నాయి. దీని వలన బరువు తగ్గడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్, బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. మిరియాలు వేడి పాలలో కలిపి తాగితే చలిలో ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా తరచుగా జలుబు, తుమ్ములు వస్తే ఒకటి నుంచి ప్రారంభించి మిరియాల సంఖ్యను 15 కు పెంచాలి. ప్రతిరోజు ఒకటి నుండి 15 వరకు మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు గోరువెచ్చని నీటిలో మిరియాలు కలిపి తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఉండదు. అలసటగా కూడా అనిపించదు. దీంతో పాటు చర్మం పొడి బారదు.

Advertisement

అలాగే నల్ల మిరియాలు మెదడుకు కూడా ఉపయోగపడతాయి. మెదడు కూడా యాక్టివ్గా ఉంటుంది. అలాగే రెండు మూడు స్పూన్ల మిరియాలు నువ్వుల నూనెలో వేయించి పొడిచేసి నొప్పి ఉన్న ప్రాంతంలో తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటివి ఉన్నవారు అక్కడ కట్టు కడితే నొప్పి వాపు తగ్గుతుంది. నల్ల మిరియాలు పసుపు కలిపిన మిశ్రమం మరియు చిగుళ్ళు కోల్పోయిన బలాన్ని తిరిగి అందిస్తాయి. అధిక బరువు ఉన్నవారు మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుని వేడి నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్యానికి మిరియాల పొడి ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే తలనొప్పి నుంచి బయటపడవచ్చు. అజీర్ణ సమస్యలతో బాధపడేవారు మిరియాలపొడి కి కొద్దిగా బెల్లం కలిపి రోజూ రాత్రి పూట ఆహారం తినడానికి ముందు తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.

Advertisement