Roasted Black Gram : నల్ల శనగలు మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందజేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నల్ల శనగల్లో మినరల్స్, ప్రోటీన్స్ ,ఫైబర్ ,ఫ్యాటీ యాడ్స్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. రక్తపోటును నియంత్రించేడమే కాకుండా ,అధిక బరువును తగ్గించడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా జీర్ణ క్రియను బలంగా చేసి… మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అయితే ఈ శనగలు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
శనగలు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందుతుంది. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఈ పప్పులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి సీజనల్ వ్యాధులను అరికడతాయి. కావున వీటిని రోజు తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. వీటిలో తక్కువ సంఖ్యలో క్యాలరీలు ఉండడం వల్ల బరువును సులభంగా తగ్గించవచ్చు. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా వీటిని తినాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేయించిన సెనగల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
Roasted Black Gram : నల్ల శనగలతో హృదయ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అనేక వ్యాధులు…

ఇది రక్తహీనత సమస్యలను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. రక్తహీనత సమస్యలతో బాధపడేవారు రోజు తినడం వల్ల రక్తం లేని సమస్యలకి దూరం కావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వేయించిన శనగల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం, పోలేట్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి హృదయ సంబంధిత సమస్యలను దూరం చేసి గుండెను ఆరోగ్యంగా చూసుకోవడానికి ప్రతి ఒక్కరు వీటిని తినాలి. వీటిలో ఉండే పోషకాలు వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. పిల్లలనుండి పెద్దల వరకు వీటిని తినవచ్చు.