Foods Bad For Bones : క్యారెట్లు ఎక్కువగా తింటున్నారా…. అయితే మీ ఎముకలకు హాని కలిగినట్లే.

Foods Bad For Bones :  ప్రస్తుతం జీవనశైలి కారణంగా..చెడు ఆహారపు అలవాట్లు వల్ల ఎముకల సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. మన నిటారుగా నిలుచోవాలన్నా, తేలిక పాటు పనులు చేసుకోవాలన్న ఎముకలు స్ట్రాంగ్ గా ఉండడం అవసరం. ఎముకలు బలంగా లేకపోతే ఏ పని చేయడానికి శరీరం సహకరించదు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు ఇటువంటి నొప్పులతో అనేకమంది బాధపడుతున్నారు. చాలామంది బయట ఫుడ్డు తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇటువంటి ఆహారం రోగనిరోధక శక్తి ఎముకలకు హాని కలిగిస్తుందని అంటున్నారు నిపుణులు. మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలు, చెడు ఆహారాల వల్ల ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుందంటున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాలను పండ్లు ,కూరగాయలు తక్కువ కొవ్వు ఉన్న పానీయాలు డైట్ లో చేర్చుకోవచ్చు. ఎముకలు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ప్రాసెస్డే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎముకలు ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చక్కెర ఎక్కువగా తీసుకుంటే ఎముకలకి హాని కలుగుతుంది. ఉప్పు ఎక్కువగా వాడినట్లయితే శరీరంలో సోడియం శాతం అధికమవుతుంది. శరీరంలో సోడియం ఎక్కువైనట్లయితే క్యాల్షియం విసర్జన అధికమవుతుంది. ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే వాటికి కావాల్సిన పదార్థాలు, ఖనిజల అవనాలన్నీ సమతుల్యంగా నిండినట్లుగా ఉండాలి, ఎముకల్లో కాల్షియం తక్కువగా ఉంటే అవి బలహీనంగా పెలుసుగా మారిపోతుంది. బలహీనంగా ఉన్న ఎముకలు త్వరగా విరిగిపోతాయి. అంతేకాకుండా డీప్ ఫ్రై వంటి స్నాక్స్ ఎక్కువగా తింటే ఎముకల ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆల్కహాల్, కేఫిన్ వంటి పానీయాలను తాగటం మంచిది. ఆల్కహాలు కాల్షియన్ని నాశనం చేస్తుంది. ఆల్కహాల్ వల్ల, శరీరం ఆహార పదార్థాలలో ఉన్న మినరల్స్, పోషకాలను గ్రహించలేదు. కూల్ డ్రింక్స్ ఎక్కువ మోతాదులో తాగిన ఎముకలు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో కార్బోనేటెడ్, ఫీజ్ ఉంటుంది.

Advertisement

Foods Bad For Bones : క్యారెట్లు ఎక్కువగా తింటున్నారా….

Carrots can be harmful to bones if eaten too much
Carrots can be harmful to bones if eaten too much

దీనివల్ల శరీరం నుంచి కాలుష్యాన్ని తొలగింపబడుతుంది. అందువల్ల ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అధిక డిప్రెషన్, కండరాల తిమ్మిరి, ఎముకలు బలహీనంగా ఉండే అవకాశం ఉంది. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్న వారి ఎముకలు క్యాల్షియం కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహార పదార్థాలు కూడా… ఎముకలను బలహీనపరిచే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచిది అని ఎక్కువగా తింటే… ఎముకలపై ఎఫెక్ట్ పడుతుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి క్యారెట్. క్యారెట్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకుంటే ఎముకలకు హాని కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువగా నూనె ఉన్న పదార్థాలను తీసుకుంటే ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత కాలంలో డైట్ కారణంగా ఎక్కువ మంది క్యాలరీల ఫుడ్ ని తింటున్నారు.

అధిక బరువు ఉన్నవాళ్లకి మేలు కలిగిస్తుంది కానీ. మిగతా వాళ్లలో ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ క్యాలరీలు ఫుడ్డు తింటే మెటబాలిజం రేటు తగ్గి, ఆకలి అధికమై, కండరాలు బలహీనమవుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలు ఎముకల ఆరోగ్యం పై హాని కలిగిస్తాయి. రోజుకి 1000 క్యాలరీలు కన్నా తక్కువ ఆహారం తీసుకుంటే ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే విటమిన్ డి, విటమిన్ కే లు కీలక పాత్ర వహిస్తాయి. శరీరం కాలుష్యాన్ని గ్రహించడంలో విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్-డి తక్కువ అయితే ఎముకలు సాంద్రత తగ్గి, ఎముకలు బలహీనమవుతాయి. విటమిన్ కె టు కొత్త ఎముకలు ఏర్పడడానికి తోడ్పడతాయి. రోజు మార్నింగ్ ఎండలో నిలిచి ఉంటే శరీరానికి విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. వీటితోపాటు విటమిన్ డి లభించే చేపలు, నారింజ ,పాలు ,కోడిగుడ్లు ,లివర్ ,చికెన్ వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు. విటమిన్ కె లభించే ఆకుకూరలు, బ్రోకలీ ,గ్రీన్ బీన్స్, చికెన్, కివి ,బటాని ,క్రీము వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.

Advertisement