Kiwi Fruit : ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు వల్ల అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంది. ఈరోజుల్లో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వెంటాడుతుంది. మధుమేహం వ్యాధి వస్తే చాలు శరీరంలో అన్ని అవయవాలను నాశనం చేస్తుంది. కానీ ఈ పండు మధుమేహం ఉన్నవారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కివీఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నారింజ, నిమ్మకాయల కంటే అధిక సంఖ్యలో ఈ కివి ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. తరచుగా ఈ పండు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
కివిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులను పోరాడే శక్తిని మన శరీరానికి అందజేస్తుంది. దీనిని రోజు తినడం వల్ల ఆస్తమా వంటి వ్యాధులతో పాటు అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ పండులో విటమిన్ ఇ, పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది ధమనులను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ గుండెను బలంగా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఈ చర్మానికి చాలా ఎంతో మేలు చేస్తుంది. కివీ జ్యూస్ రోజు తాగడం వల్ల చర్మంపై ఏర్పడ్డ మచ్చలు ,మొటిమలు తగ్గిపోతాయి.డయాబెటిస్ రోగులకు కివీ ఒక వరం అంటూ చెబుతున్నారు నిపుణులు. ఈ పండు తక్కువ గ్లైసేమిక్ సూచనలను కలిగి ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.
Kiwi Fruit : కివీఫ్రూట్ పండు తింటే చాలు..

డయాబెటిస్ పేషెంట్లు ప్రతిరోజు కివీ ఫ్రూట్ తినడం ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పండుని పోషకాల గని గా పరిగణింపబడింది. ల్యూ టీన్,జియాక్సంతిన్, ఫైటో కెమికల్స్ లాగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం శాతాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఈ పండుతో రక్తహీనత సమస్యలను దూరం చేయవచ్చు. ప్రతిరోజు కివీని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండు రోగ నిరోధక శక్తిని పెంచి, మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. రక్త కణాలు సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల రక్త కణాల సమస్య నుండి దూరం కావచ్చు. ఇది కంటికి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండుని ప్రతిరోజు తీసుకుంటే మన ఆరోగ్య రెట్టింపు అవుతుంది