health tips : చింత‌గింజ‌ల‌ను ప‌డేస్తున్నారా…. వీటితో డ‌యాబెటిస్ స‌మ‌స్య‌కు గుడ్ బై చెప్ప‌వ‌చ్చు…

health tips : వేస‌వికాలంలో ఎక్కువ‌గా చింత‌పండును కొనుగోలు చేస్తాం. ఈ కాలంలోనే ఇది చింత‌కాయ నుంచి చింత‌పండుగా మారుతుంది. అయితే మ‌నం చింత‌పండు పైగుజ్జు తీసి,వాటిలోని గింజ‌ల‌ను ప‌డేస్తుంటాం. ఈ చింత‌గింజ‌లను పొడి చేసుకుని రోజు వాడితే మ‌నం కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. చింత‌గింజ‌ల పొడితో ముఖ్యంగా అయిదు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌గా డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు.

Advertisement

అయితే చింత‌గింజ‌ల పొడి మ‌న శ‌రీరంలోని పాంక్రియ‌స్ గ్రంధిలో ఇన్సులిన్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీనివ‌ల‌న మ‌న శ‌రీరంలోని డ‌యాబెటిస్ ను నియంత్ర‌ణ‌లో వుంచుతుంది. అందుకే,రోజు కొద్దిగా మ‌రిగిన నీళ్ల‌ల్లో చింత‌గింజల పొడి క‌లుపుకొని తాగితే షుగ‌రు కంట్రోల్ లో వుంటుంది. కొంత‌మందికి తాగే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువైతే ప‌ళ్ల‌మీద గార‌లాగా ఏర్ప‌డుతుంది. అయితే చింత‌గింజ‌ల పొడిని ప‌ళ్ల‌పొడిలాగా చేసుకొని రోజు రుద్దితే ఆ మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి.మ‌న ఎముక‌ల మ‌ధ్య కార్టిలైజ్ విరిగిపోయింద‌ని,ఒక‌సారి విరిగిపోతే మ‌ళ్లీ రాద‌ని కొంద‌రు అంటుంటారు.కార్టిలైజ్ దెబ్బ‌తిన‌డానికి కార‌ణం మ‌న శ‌రీరంలో రిలీజ్ అయ్యే హానిక‌ర‌మైన ఎంజైమ్స్.ఈ చింత‌గింజ‌ల పొడి ఎంజైమ్స్ యొక్క ఉత్ప‌త్తిని త‌గ్గిస్తుంది. దీనివ‌ల‌న కార్టిలైజ్ ను కాపాడుకోవ‌చ్చు.ఈ మధ్య‌కాలంలో ఎక్కువ‌గా ఆటోఇమ్యూన్ డిసార్డ‌ర్స్ బాగా వ‌స్తున్నాయి.

Advertisement

health tips : చింత‌గింజ‌ల‌తో డ‌యాబెటిస్ స‌మ‌స్య‌కు గుడ్ బై చెప్ప‌వ‌చ్చు

health benifits of Tamarind seeds
health benifits of Tamarind seeds

ఈ చింత‌గింజ‌ల పొడిలో 20 ర‌కాల శ‌క్తివంత‌మైన కెమిక‌ల్ యాంటీయాక్సిడెంట్లు వుంటాయి. అందువ‌ల‌న ఈ పొడి ఈ డిసార్డ‌ర్ ను రాకుండా కాపాడుతాయి.అలాగే కొంత‌మందికి ముఖంపైన న‌ల్ల‌టి మ‌చ్చ‌లు వ‌స్తూ వుంటాయి. చింత‌గింజ‌ల పొడికి ఈ మ‌చ్చ‌ల‌ను త‌గ్గించే శ‌క్తి వుంటుంది. అందుకే ఈ పొడిని కొన్ని నీళ్ల‌లో వేసి బాగా క‌లిపి తాగాలి.ఇలా రోజు తాగితే మొహంపై మ‌చ్చ‌లు రాకుండా వుంటాయి. అందుకే చింత‌గింజ‌ల‌ను ప‌డేయ‌కుండా ఇలా పొడి చేసుకుని వాడుకోండి. వీటివ‌ల‌న‌ ఈ ఐదు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.కొంత‌మంది చింత‌గింజ‌ల‌ను కాల్చుకొని నోట్లో వేసుకొని చ‌ప్ప‌రిస్తుంటారు. ఇలా కూడా తిన‌వ‌చ్చు

Advertisement