Health : అధిక నిదర ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతుంది. మధ్యాహ్నం సమయంలో ఆహారం తిన్న వెంటనే తీవ్ర నిద్ర వస్తుంది. కానీ తిన్న వెంటనే నిద్రపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే పోషణ ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. రోజు మొత్తంలో ఆరు నుండి ఎనిమిది గంటల నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పగటి పుట నిద్రపోతుంటారు. పగటిపూట నిద్ర ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
పగటిపూట అధికంగా నిద్రపోయే వారికి రక్త పోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పగటిపూట అధికంగా నిద్రపోయే వారికి అధిక రక్తపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లయింది. Nap అనేది స్వల్ప కాలిక నిద్ర. ఇది నిద్ర రాత్రిపూట పోయే నిద్రలా గాఢంగా కాకుండా తేలికపాటిలా ఉంటుంది. చాలామంది మధ్యాహ్నం తినగానే చిన్నపాటి కునుకు తీస్తారు. భోజనం తర్వాత కొద్దిపాటి కొనుకు తీయడం వల్ల విశ్రాంతి కలుగుతుంది. కానీ నిద్ర ఎక్కువైతే ఆరోగ్యానికి మంచిది కాదు. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల, రాత్రి సరిగా నిద్ర ఉండదు. అంటే నిద్రలేమి సమస్యలకు తలెత్తుతాయి.
Health : పగటి పూట నిద్ర ఆరోగ్య సమస్యలను తలెత్తేలా చేస్తుందట.

నిద్ర సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించదు. దీంతో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీంతో విశ్రాంతి లభించక మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంది. పగటిపూట నిద్రపోయే వారిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. 1996 పరిశోధనలో అధ్యయనాల ప్రకారం పగటిపూట ఎక్కువ నిద్రపోయేవారు అధిక బరువు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువసేపు నిద్రపోయే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని అధ్యయనం తెలిపింది.