Health Care : యాంటీ ఆక్సిడెంట్సు విటమిన్లు కనిజాలు పుష్కలంగా లభించే పండ్లను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అయితే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వాటిని సరైన సమయంలో తినాల్సి ఉంటుంది . వీటిలో కొన్ని రకాల పండ్లను పొద్దున్నే పరగడుపున ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. ఇలా తీసుకోవడం వలన కొత్త సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండి.
సిట్రస్ పండ్లు…..
సిట్రస్ పండుగా పిలవబడే నారింజ ,బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. కాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వలన పేగుల లోపలి పోరను పాడు చేస్తుంది. దీని కారణంగా గుండెలో మంట ,వికారం జ్వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే సిట్రస్ జాతి పండ్లను ఖాళీ కడుపుతో పరిగడుపన అసలు తినకూడదు.
అరటిపండు…..
అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా అరటి పండ్లను పరిగడుపున తీసుకోవడం వలన అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అరటి పండ్లలో ఉండే ఫైబర్ స్టమక్ యాసిడ్ తో కలిసి గ్యాస్ పట్టడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకుు దారి తీస్తుంది. అయితే అరటి పండ్లను పరిగడుపున తీసుకోవడం వలన ఇలా జరిగే ప్రమాదం ఉంది కనుక ఖాళీ కడుపుతో వీటిని అసలు తీసుకోకూడదు.
ఆపిల్…..
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే పండు ఆపిల్. ఏ సమస్య వచ్చినా సరే డాక్టర్ యాపిల్ తినమని చెప్తుంటారు. అయితే యాపిల్ లో ఫైబర్ మరియు ఎసిడిక్ కంటెంట్ అధిక స్థాయిలో ఉంటుంది. కావున ఖాళీ కడుపుతో ఆపిల్ పండ్ల ను తింటే దీనిలోని సమ్మేళనాలు స్టమక్ లైనింగ్ ను పాడుచేస్తాయి. తద్వారా అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
పైనాపిల్……
పైనాపిల్స్ లో బ్రోమేలైన్ అనే ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్ ఉంటుంది. ఖాళీ కడుపుతో పైనాపిల్ తీసుకోవడం వలన ఇది కడుపునొప్పికి దారి తీస్తుంది. దీనిలో ఉండే బ్రోమిలైన్ ఎంజైమ్ పరిగడుపున తీసుకోవడం వలన వాంతులు ,వికారం ,విరోచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుంది. కావున ఖాళీ కడుపుతో పైనాపిల్స్ అస్సలు తినకూడదు. అందుకే వాటిని భోజనం తర్వాత లేదా ఒక గ్లాస్ పాలు తాగిన తర్వాత తీసుకోవడం మంచిది.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారాన్ని సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించడం జరిగింది. యువతరం దీనిని ధ్రువీకరించలేదు. గమనించగలరు.