Health Care Tips : మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. శరీరానికి కావలసిన నీరు అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజు మనం తీసుకునే ఆహారాలతో పాటు రోజుకు తగినంత నీళ్లు కూడా అవసరమే. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగాలి. మన శరీరానికి కావాల్సిన అంత నీళ్లు తాగకపోతే ఏర్పడే సమస్య డీహైడ్రైషన్. ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. మనిషి శరీరంలో 60 శాతం నీళ్లు ఉండాలి. ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్లు నీరు తాగితేనే శరీరానికి కావాల్సిన నీరు అందుతాయి. రోజు తగినంత నీళ్లు తాగకపోతే అనేక రకాల వ్యాధులు వెంటాడుతాయి.
నీటి కొరత కారణంగా ఏ వ్యాధులు వస్తాయో పరిశీలిద్దాం. నీళ్లు తక్కువ తాగే వారికి స్థూలకాయం సమస్య తలెత్తవచ్చు. కొంతమంది ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకున్న… తాగే నీరు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. రోజు శరీరానికి కావాల్సినంత నీరు తాగరు. దీని ఫలితంగా ఆకలి వేయడం, ఆహారం ఎక్కువ తీసుకోవడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నీళ్లు తక్కువగా తాగే వారికి స్థూలకాయం ఓ సమస్యగా మారుతుంది. నీరు తక్కువగా తాగే వారిలో ప్రధానంగా కనిపించేది నోటి దుర్వాసన. నీళ్లు తక్కువగా తాగడం వల్ల నోట్లో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.
Health Care Tips : నీళ్లు తక్కువ తాగటం వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసా.

దీని ఫలితంగా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకు కనీస రెండు లీటర్ల నీళ్లు తాగాలి. శరీరానికి సరిపడ నీరు తాగినట్లయితే ముఖం కాంతి హీనంగా మారటం. నీళ్లు తక్కువగా తాగితే ముఖంపై కాంతిని కోల్పోతారు. అంతేకాకుండా ముఖంపై పిగ్మెంటేషన్, పింపుల్స్ ఏర్పడతాయి. ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవాలంటే తప్పకుండా తగినంత నీళ్లు తాగవలసిందే