Boiled Eggs : గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్లు తినడం వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. కోడిగుడ్డులో పోషకాలు ,ప్రోటీన్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. పెద్దల నుండి పిల్లల వరకు రోజు ఒకటి లేదా రెండు కోడిగుడ్లు తినాలని వైద్య నిపుణులు చెబుతారు. కొందరు పచ్చి కోడి గుడ్డుని తాగేస్తారు. మరికొందరు గుడ్లతో వివిధ రకాల బ్రేక్ ఫాస్ట్ లు తయారు చేసి తింటుంటారు. సాధారణంగా రోజు ఒక కోడి గుడ్డు తినడం వల్ల 80 నుండి 70 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, ఐదు గ్రాములు కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల శరీరానికి అందుతుంది.
గుడ్డులో శరీరానికి అవసరమైన లవణాలతో పాటు పాస్పరస్ ,అయోడిన్, ఐరన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఉడికించిన గుడ్డు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్డులో క్యాల్షియం ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన కోడి గుడ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే కొంతమంది ఉడికించిన గుడ్డిని ఎక్కువసేపు నిల్వ ఉంచి తింటుంటారు. అసలు ఉడికించిన కోడిగుడ్డుని ఎన్ని గంటల్లో తినాలి..? ఎక్కువసేపు నిల్వ ఉంచితే ఏమవుతుందో తెలుసుకుందాం. గుడ్డును ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు. ఉడికించిన గుడ్డిని చల్లబరిచిన తర్వాత వెంటనే ఫ్రిజ్లో పెట్టాలి. ఉడికించిన గుడ్డు ని ఏడు రోజులు వరకు నిల్వ ఉంచవచ్చు.
Boiled Eggs : ఉడికించిన గుడ్లను ఎక్కువ సేపు నిల్వ ఉంచుతున్నారా…?

ఉడికించిన కోడిగుడ్డుని వెంటనే తినకపోతే దానిపై ఉన్న పెంకు తీయవద్దు. తినే ముందు మాత్రమే వాటిపై ఉన్న పెంకును తీయాలి. ఇలా చేయడం వల్ల గుడ్డుకు ఎటువంటి బ్యాక్టీరియా సోకదు. గుడ్డుని ఉడికించేటప్పుడు అవి చిట్లిపోతే వెంటనే తినాలి. ఉడికించిన గుడ్డుని ఫ్రిజ్లో పెడితే నిల్వ ఉంచవచ్చు కానీ బయట రెండు గంటల పాటు కంటే ఎక్కువ సమయం ఉంచితే మంచిది కాదు. గుడ్డిని ఉడికించి ఎక్కువసేపు నిల్వ ఉంచితే.. వాటి నుంచి దుర్వాసన రావడం మొదలవుతుంది. అందువల్ల మీరు గుడ్డుని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే. ఫ్రిజ్లో పెట్టడం లేదా చల్లటి నీళ్లు ఉంచడం మంచిది ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా గుడ్డుకు సోకదు