Smart Phone : ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్ హవా ఎలా కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే అవి జీవితంలో ముఖ్యమైనవిగా మారిపోయాయి. ఇక నేటి తరం పిల్లలైతే స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు పడిపోతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు అల్లరి చేయకుండా ఉండేందుకు వారికి ఫోన్ ఇచ్చి అలవాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఫోన్ చూస్తూనే అన్నం తింటున్నారు. అయితే తాజాగా నివేదించిన ఓ అధ్యయనం ప్రకారం రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఫోన్ చూస్తూ అన్నం తినే వారి సంఖ్య 90 శాతం మంది ఉన్నట్లుగా అధ్యయనంలో తేలింది.
ఇక ఈ విధంగా పిల్లలు కడుపునిండా అన్నం తింటూన్నారని మనం అనుకుంటాం కానీ ఇలా తినడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీని వలన వారిపై మానసికంగానూ శారీరకంగానూ చెడు ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అయితే మన పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడటం వలన వారి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఇక సెల్ ఫోన్ చూసే పిల్లల్లో నలుగురిలో ఒకరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎవరితో మాట్లాడకుండా పిల్లలతో ఆడుకోకుండా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇదే ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఇక పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వలన వారు ఏం తింటున్నారు అనేది కూడా గమనించరు.
ఏదో ఒకటి తినేస్తున్నాంలే అనుకుంటారు తప్ప తినే ఆహారం మీద దృష్టి ఉండదు. అలాగే పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ చూడడం వలన వారి కంటిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. తద్వారా కళ్ళు బలహీనంగా తయారవుతాయి. దీని కారణంగా చిన్న వయసులోనే కళ్ళజోడు ధరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేకాక చిన్న వయసు నుండే ఇలా ఫోన్ చూడడం వలన కంటిలోని రెటీనా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇదే కొనసాగితే దీర్ఘకాలం కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే పిల్లలకు వీలైనంత వరకే స్మార్ట్ ఫోన్ ఇవ్వడం మంచిది కాదు. దీనికి బదులుగా టీవీలో వారికి నచ్చినవి పెట్టడం ఉత్తమం తద్వారా కంటి రేటినాపై ప్రభావం పడదు.