Health Tips : చాలామంది కూరగాయల భోజనం కంటే.. పచ్చడి పరమాన్నంలా ఉంటుందని రకరకాల పచ్చళ్ళపై ఆసక్తి చూపుతున్నారు. వేడివేడి అన్నంలో ఎర్ర ఎర్రగా పచ్చడి కలుపుకొని తింటే వచ్చే రుచే వేరు. టేస్ట్ ఎక్కువగా ఉందని పచ్చళ్ళను రోజు తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదని చెబుతున్నారు నిపుణులు. కూర కాయ పచ్చళ్ళు రోజు అధికంగా తింటే జరిగే ప్రమాదం గురించి తెలుసుకుందాం.
కొత్త కొత్త వంటలు చేసి విస్తరిలో వడ్డించిన పచ్చడి కోసం వెతుక్కోవడం మన తెలుగువారి స్వభావం. ఈ పచ్చలను అన్నంలోనే కాకుండా, వేడివేడి ఉప్మా ,దోశ ,వడ ,ఇడ్లీ… ఇలా ప్రతిదానిలో పచ్చడతో లాగిస్తారు. పచ్చళ్ళు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చళ్ళు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండడానికి వేసే ఉప్పు వల్ల ఆ ఆరోగ్యానికి ముప్పు వస్తుంది. బీపీ ఉన్నవారు పచ్చళ్ళతో భోజనం చేస్తే ఈ సమస్య అధికమవుతుంది. హైపర్ టెన్షన్లు రోగాలు కూడా ప్రమాదమే. ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే పచ్చళ్ళు ప్రిజర్వేటీవ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి. రోజు అదే పనిగా పచ్చళ్ళు ఎక్కువగా తింటే కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
Health Tips : పచ్చళ్ళు అధికంగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..? పురుషులకు హానికరమైన ఫైల్స్….

వివిధ రకాల మార్కెట్లో తయారు చేసే పచ్చళ్ళు టెస్ట్ కోసం నూనె ,మసాలా కారణంగా…. ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. వీటితో పాటు చెడు కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు అధికమవుతాయి.తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పచ్చడి ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే తీసుకోవడం మంచిది. మరి తినాలనిపిస్తే సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసిన పచ్చళ్లను… అవి కూడా నూనె ఉప్పు కారం తక్కువ కలిపిన పచ్చలను కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది.