TEA : చాలామంది ఉదయం లేవగానే టీ తాగకుండా ఏ పనిని మొదలు పెట్టరు. టీ తాగడం వలన శరీరంలో ఒత్తిడి తగ్గి శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ టీ కాఫీలో కేఫిన్ అనే పదార్థం శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే అలాంటి టీ వలన కొన్ని ప్రయోజనాలు కొన్ని నష్టాలు ఉన్నాయి. దీనిలో ఒక టీ తాగితే చర్మం నల్లగా అవుతుందా.. అనే అనుమానం చాలా మందిని వేధిస్తోంది. ఈ భయం వలన కొంతమంది టీ కి దూరంగా ఉంటున్నారు. అయితే దీనిలో ఎంతవరకు నిజం దాగి ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… నల్లటి చర్మం కలిగి ఉన్నవారు చాలా బాధపడుతుంటారు.
దీనిని మార్చుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే టీ తాగడం వలన కడుపునొప్పి, నిద్రలేమి. అలాగే మధుమేహం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి టీ తాగకుండా అసలు ఉండలేరు. చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకు టీ తాగుతూ ఉంటారు. ఎందుకంటే దీనిలో కెఫిన్ ఉంటుంది. ఇది ఒక్కసారి తాగారంటే ఇక అదే పనిగా రోజు తాగుతూ ఉంటారు. టీ తాగే అలవాటు మానుకుంటే మంచిది కానీ అనవసరంగా ఆ అనుమానాన్ని జీవితాంతం మోసుకెళ్ళడం మంచిది కాదు. టీ తాగితే చర్మం నల్లగా అవుతుంది.

అనడానికి ఇప్పుడు వరకు ఎటువంటి సైంటిఫిక్ రీసన్ అనేది లేదు వైద్యునిపుణుకు చెప్తున్నారు. చర్మం రంగు జన్యు శాస్త్రం జీవనశైలి బహిరంగ కార్యపాల చర్మం లోని నిన్ను ఉనికిపై ఆధారపడి ఉంటుంది. టీ తాగడం వలన చర్మం నల్లగా అవుతుంది అనేది అవాస్తవం. ఇందులో వాస్తవం అంటూ ఏమీ లేదు. టీ తాగితే ముఖం నల్లగా అవుతుందనే ఆలోచన మానుకోవాలి. టీ అధికంగా తాగితే శరీరంలో కొన్ని వ్యాధులు సంభవిస్తాయి. కాబట్టి టీ అధికంగా తాగకుండా రోజుకి రెండు మూడు కప్పులు కంటే ఎక్కువగా తాగడం మంచిది కాదు. రెండు కప్పులు తాగితే చాలు. టీ తాగడం వలన ముఖం నల్లగా అవుతుందనే అపోహ నుంచి బయటపడండి.