Cherries For Weight Loss : ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక సమస్యగా మారిపోయింది. కానీ బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్ లో ఎన్నో రకాల ఆహార పదార్థాలను చేరుస్తూ ఉంటారు. అయితే ఈ పండ్లను తినడం వల్ల బరువు సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఉదయం ఏదో ఒక పండు తింటుంటారు. ముఖ్యంగా చెర్రీస్ లాంటి అధిక ఫ్రూట్ పోషకాలు ఉన్న పండ్లను తీసుకుంటారు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ,సి విటమిన్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందజేస్తాయి. వీటిని రోజు తినడం వల్ల అధిక బరువు తగ్గి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా ఉంటుంది
ఈ చెర్రీ పండ్లు శరీరంలో అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ పండ్ల లో ఉండే మూలకాలు ఫ్యాటీను వేగవంతంగా కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఇవి తినడం వల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు రోజు చెర్రీస్ ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి అధిక సంఖ్యలో ఉంటాయి. కావున శరీరంలో ఉన్న ఫ్యాట్ ని ఈజీగా తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకున్నవారు ఈ పండ్లను తప్పకుండా తీసుకోవాలి. రోజు మనం తినే ఆహారంలో చెర్రీస్ ని చేర్చుకోవడం వల్ల శరీరంలో కేలరీలు ఖర్చవుతాయి . అంతేకాకుండా కొవ్వును కరిగించడంలో ఈ పండ్లు శక్తివంతంగా పనిచేస్తాయి.
Cherries For Weight Loss : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయా.

అయితే చెర్రీస్ లో ఉండే మెలటోనిన్ హార్మోన్ బాగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఈ పండ్లలో పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన సోడియంను తగ్గించడానికి శక్తివంతంగా పనిచేస్తాయి. మన శరీరంలో పొటాషియం, సోడియం సమానంగా ఉండడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ పండ్ల లో ఉండే ఆంతో సైనిన్స్ , ఆంటీ యాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా చెర్రీస్ రక్తపోటును తగ్గించి.. వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అనేక రకాల క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. ఫ్రీ రాడికల్ జరిగి హృదయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది