Kidney Stone : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్లు వల్ల చాలామందిలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి సమస్యల వల్ల చాలా బాధపడవలసి ఉంటుంది. కొన్నిసార్లు మూత్రపిండాలలో ఏర్పడ్డ రాళ్ల వల్ల మూత్ర విసర్జన ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఏర్పడ్డ రాళ్లు కరిగిపోతాయని కొందరు అంటున్నారు. బీర్ తాగడం వల్ల శరీరంలో యూరిన్ ఎక్కువగా తయారవుతుంది. టాయిలెట్ ఎక్కువసార్లు వస్తుంది. స్పీడ్ లో చిన్నచిన్న రాళ్లు ముక్కలు బయటికి వస్తాయని చెబుతున్నారు. కానీ వీరు ఎక్కువసార్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ప్రమాదంగా మారుతుంది. ఇది ఎలా అంటే.
మూత్రపిండాలల్లో రాళ్లు పరిమాణం పెద్దగా ఉంటే అవి బయటికి రావడం చాలా కష్టమవుతుంది. కానీ రాయి పరిమాణం ఐదు మిల్లి కంటే ఎక్కువగా ఉంటే అది టాయిలెట్ బయటకు వెళ్తుంది. రాయి అంతకంటే పెద్ద పరిమాణంలో ఉంటే డాక్టర్ సంప్రదించాలి. బీరు ఎక్కువ తాగడం వల్ల శరీరం నుండి రక్తాన్ని శుద్ధి చేయడానికి కిడ్నీ ఎక్కువ శ్రమ పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కిడ్నీపై ఒత్తిడి అధికమవుతుంది. బీర్ తాగడం వల్ల శరీరంలో డిహై డ్రేషన్ ఏర్పడుతుంది. ఇది శరీర కణాలు, పనితీరును ప్రభావితం చేస్తుంది. ఎక్కువ బీరు తాగడం వల్ల కిడ్నీలో రాయి పరిమాణం పెరుగుతుంది.
Kidney Stone : బీరుతో కిడ్నీలో రాళ్లు కరిగించుకోవచ్చా….? అది ఎలా అంటే.

బీర్ శరీరంలో అధిక ఆక్సలైట్ స్థాయిని అధికం చేస్తుంది. ఇది రాయి పరిమాణాన్ని పెంచడానికి పనిచేస్తుంది. బీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీరుని ఎక్కువసార్లు తాగితే నొప్పి తీవ్రమైతుంది. చాలాసార్లు మూత్ర విసర్జన మార్గంలో రాయి ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. కావున కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీరు తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.