Weight loss : కూరగాయలు తింటే మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇంటిలోనే లభించే బెండకాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయట. దీనిని మనం రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలు మార్కెట్లో విరివిరిగా అతి తక్కువ ధరలకే లభిస్తాయి. మనం తినే చెడు ఆహారపు అలవాట్లు వల్ల అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నాం. అయితే మన ఇంట్లో లభించే కూరగాయలు పోషకాలు అధికంగా ఉంటాయట. బెండకాయలను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే బరువు ఈజీగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
నిత్యం మార్కెట్లలో ఈ బెండకాయలు కనిపిస్తాయి. వీటితో వివిధ రకాల వంటలను చేస్తారు. వీటిని తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని పిల్లలకు పెడితే లెక్కలు బాగా వస్తాయని చాలామంది అంటుంటారు. వీటివల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ బెండకాయలతో కలిగే లాభాలేంటి తింటే బరువు తగ్గుతారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాయలు విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల హృదయ సంబంధి. సమస్యలకు తావు ఉండదు. అదేవిధంగా చెడు కొవ్వుని శరీరం నుండి బయటకు పంపడంలో సహాయపడుతుంది.
Weight loss : బెండకాయలతో ఈజీగా బరువు తగ్గవచ్చా..

ఇందులో ఉన్న విటమిన్ ఏ బేటా కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. బెండలో క్యాలరీలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. అధిక శాతం ఫైబర్ ఉండడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ అనిపిస్తుంది. వీటిని తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో బెండకాయ ప్రముఖ పాత్ర వహిస్తుంది. బెండకాయను ఆహారంలో భాగంగా చేర్చుకున్న వారికి మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. పేగులను క్లీన్ చేయటంలో కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఎజినల్ అనే ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ తో బాధపడేవారు బెండను ఆహారంలో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో రక్తహీనత సమస్యలను దూరం చేసి, అధిక రక్తాన్ని పెంచుతుంది. ఫో లెట్ ,విటమిన లు మొదలైనవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. పచ్చి బెండకాయ నేరుగా తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అద్భుతంగా అందుతాయిట. మూడు బెండకాయలను తీసుకొని బాగా శుభ్రం చేసుకుని వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను గ్లాస్ నీటిలో వేసి రాత్రిరంతా నానబెట్టి ఈ ముక్కలు తీసివేసి నీటిని తాగాలి. ఈ ముక్కల్లో ఉన్న పోషకాలని నీటిలోకి చేరుతాయి. ఉదయాన్నే నీటిలోనే బెండ ముక్కలను తీసివేసి నీటిని తాగాలి .అప్పుడు మన శరీరానికి కావలసిన ప్రయోజనాలన్నీ అందుతాయి