Patika Bellam Health Benefits : పటిక బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా. కానీ ఎక్కువగా తిన్నారంటే.

Patika Bellam Health Benefits : పట్టిక బెల్లాన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తీయగా రుచిగా ఉండే పదార్థం. శరీరానికి చలవ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి శరీరానికి బలాన్ని ఇస్తుంది. వాత , పిత్త,కఫ దోషాల వలన అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది.తియ్యగా ఉందని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధక సమస్యలు తలెత్తుతాయి. పటిక బెల్లం తో కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పంచదారను ప్రాసెస్ చేయడానికి ముందు వెలువడే రూపమే పటిక బెల్లం. దీనిని కలకుండా లేదా మిశ్రీ అని కూడా అంటారు. పటిక బెల్లం పంచదార కంటే శరీరానికి చాలా మేలు చేస్తుంది.

Advertisement

రెండు దొండ పండ్లు ను పటిక బెల్లం పొడిలో అద్దుకొని తిన్నట్లయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి. ఒక స్పూన్ పట్టిక బెల్లం పొడి లేదా ఎండు కొబ్బరి కోరు పిల్లలకు ఇస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో పట్టిక బెల్లం పొడిని కలుపుకొని రెండు లేదా మూడుసార్లు తీసుకున్నట్లయితే స్వరపేటీక సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది ఆద్వాపక , ఉపవాస వృత్తిలో ఉండేవారు వారికి బాగా ఉపయోగపడుతుంది. రెండు స్పూన్లు అటుక బెల్లం పొడి, ఒక స్పూన్ గసగసాల పొడిని తీసుకొని ఈ రెండింటిని కలిపి మెత్తగా నూరి గాజు సీసాలో నిల్వ ఉంచుకొని పుటకు రెండు చెంచాలు చొప్పున రెండు పూటలు తింటే గర్భిణీ స్త్రీలలో వచ్చే పొత్తికడుపు నొప్పి. కండరాలు బిగుసుకుపోవడం, రక్త విరోచనాలు, బంక విరోచనాలు వంటివి నయమవుతాయి.

Advertisement

Patika Bellam Health Benefits : పటిక బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

Eating a lot of alum jaggery is good for health
Eating a lot of alum jaggery is good for health

పటిక బెల్లాన్ని, అరగదీసిన మంచి గంధాన్ని కలుపుకొని ఈ మూడింటిని అర గ్లాసు బియ్యం కడిగిన నీటిలో కలిపి మూడు పూటలు తీసుకుంటే రక్త విరోచనాలు, బంక విరోచనాలు తగ్గుతాయి. పటిక బెల్లం 20 గ్రాములు ఆవు నెయ్యి 20 గ్రాములు బాదం పప్పులు ఐదు తీసుకుని ఈ మూడింటిని కలిపి మూడు పూటలు తీసుకుంటే దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో పటిక బెల్లం వేసి కలిపి తీసుకుంటే దాహం బాగా వేస్తుంది. అటిక బెల్లం పొడి అర స్పూను, ఇప్పటికైనా టీ స్పూను పుదీనా ఆకులు రసం కలిపి రెండు లేక మూడు పూటలు తీసుకుంటే చర్మంపై వచ్చిన దద్దుర్లు తగ్గుతాయి. వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, పట్టిక బెల్లం పొడి కలిపిన నీటిలో ఎండు ఖర్జూరాలను వేసి ఉంచాలి. మధ్యాహ్నం సమయంలో ఈ నీటిని పిల్లలకి ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

Advertisement