Apple side Effects : రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అందరూ అంటుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ యాపిల్స్ తింటున్నారా….?అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.యాపిల్లో ఫైబర్ ,విటమిన్ సి ,పొటాషియం వంటి వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలనే అందజేస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గించి శరీరానికి కావలసిన శక్తి ని సమకూరుస్తాయి. యాపిల్స్ మంచిదని చాలామంది రోజు మొత్తంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. రోజు ఒక యాపిల్స్ తినడం కుదరకపోవచ్చు.
కానీ వీలైనప్పుడల్లా, వారానికి కనీసం మూడు ఆపిల్ అయిన తింటే ఆరోగ్యానికి మంచిది.యాపిల్స్ వివిధ రకాల క్యాన్సర్లకు గురికాకుండా చేస్తుంది. ఆపిల్ మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది. మతిమరుపుకు కారణమయ్యే ఆల్జీమర్స్ వ్యాధిని నివారిస్తూ, మెదడుకి రక్షణ ఇస్తుంది. అంతేకాకుండా నరాలపై దాడి చేసే పార్కినాన్స్ వ్యాధిని తగ్గిస్తుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులోనే ప్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ,ఫైటో నూట్రియన్స్ ,సూక్ష్మజీవుల నుంచి కళ్లకు హాని జరగకుండా కాపాడుతాయి.
Apple side Effects : యాపిల్ ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తింటున్నారా…

విటమిన్ సి యాపిల్లో అధికంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరానికి కావాల్సిన ఎనర్జీ ని ఇస్తుంది. వివిధ రకాల పండ్లతో పోలిస్తే పాంక్రియాస్ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ కల్పించే గుణం ఆపిల్లో 20 శాతం ఎక్కువ. వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుందని కార్నే ల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తెలిసింది. రోజు ఒక ఆపిల్ తినడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాపిల్ మంచిది డి టాక్సీ పైయింగ్ ఏజెంట్ కూడా. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటే కాలేయంలోనే విషయాన్ని విజయవంతంగా తొలగిస్తుంది. ఈ రోజుల్లో ఆపిల్ తినే వారి సంఖ్య అధికమయ్యింది. రోజు ఆపిల్ తినడం మంచిదే అయినా… ఎక్కువగా తీసుకోవడం మాత్రం చాలా ప్రమాదకరం. రోజు ఎక్కువగా యాపిల్స్ తింటే అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది.
ఆపిల్స్ రోజు మొత్తం ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ఆపిల్స్ లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిది అని రోజు మొత్తంలో ఎక్కువ యాపిల్ తింటే బరువు పెరుగుతారు. జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజుకి ఎక్కువ సార్లు తినడం వల్ల కడుపునొప్పి సమస్యలు వస్తాయి. ఆపిల్స్ రోజు మొత్తంలో ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దంతాలు దెబ్బతింటాయి. ఇందులో ఉండే ఆమ్లం వలన దంత సమస్యలు కలుగుతాయి. కాబట్టి రోజుకు ఒక యాపిల్ మాత్రమే తినాలి