Sapotah Benefits : సపోటా పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. దీనిలో పోషకాలు అధికంగానే ఉంటాయి. ఈ పండు అధిక యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. సపోటా ఎన్నో రకాల వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది. సపోటా చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్న దీనిలో ఉండే ఔషధ గుణాలు మాత్రం అధికంగానే ఉంటాయి. తరచుగా సపోటా పండ్లు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక పోషకాలు కలిగి ఉండి వివిధ రకాల వ్యాధులను దూరం చేస్తుంది. ఆయుర్వేదంలో సపోటా బెరడు ని అనేక రకాల ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు. సపోటా గింజలు వివిధ రకాల వ్యాధులను దూరం చేసేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేశారు.
ఈ పండు బ్యాక్టీరియా వల్ల ఏర్పడ్డ ఇన్ఫెక్షన్ త్వరగా నయం చేస్తుంది. ప్రతిరోజు సపోటా తినడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ తగ్గి కాలేయం బలంగా తయారవుతుంది. ఈ పండు బెరడును నీటిలో ఉడికించి కషాయం చేసి తాగినట్లయితే అధిక జ్వరంతో బాధపడే వారికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తీవ్రమైన జ్వరాన్ని నయం చేయడంలో సపోటా డికాషన్ చాలా బాగా పనిచేస్తుంది. జ్వరం త్వరగా తగ్గాలంటే ఐదు నుండి పది మిల్లి ఎమ్మెల్యే వరకు కషాయాన్ని తీసుకోవచ్చు. ఈ పండు బలహీనతను తగ్గించడంతోపాటు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటుంది. బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు రెండు సపోటా పండ్లు తినాలని వైద్యులు చెబుతున్నారు. దీనిలో క్యాల్షియంతో పాటు ఐరన్ అధికంగానే ఉండి ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది.
Sapotah Benefits : సపోటా తో అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు… బరువు తగ్గడం నుండి జ్వరం వరకు

ఈ పండు వివిధ రకాల నొప్పులను వాపును నయం చేస్తుంది. అధికంగా నొప్పి ఉన్నచోట సపోటా గుజ్జుని మర్దన చేసినట్లయితే త్వరగా నొప్పి నుండి విశ్రాంతి కలుగుతుంది. ఈ పండు వివిధ రకాల వాపులను కూడా అధిగమిస్తుంది. ఈ పండులో విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిలో కంటికి మేలు చేసే విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. సపోటాలు జీర్ణక్రియకు అవసరమయ్యే ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ ,మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది . బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారంగా పనిచేస్తుంది. ఈ పండులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు సపోటా షేక్ లేదా సపోటా ఫ్రూట్ తినడం ఉత్తమం.