Health Benefits : ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది అధిక బరువుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అధిక బరువును తగ్గడానికి ఎన్నో రకాల టిప్స్ ను పాటిస్తున్నారు. అయితే అధిక బరువును తగ్గాలి అనుకునేవారు పలు రకాల ఫ్రూట్స్ కి చెక్ పెట్టాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకనగా ఆ పండ్లు శరీర బరువును అధికమయ్యేలా చేస్తాయి.ఈ అధిక బరువు వలన ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. కావున ఎంత వీలు పడితే అంత తొందరగా అధిక బరువును తగ్గాలని వైద్య రంగం వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పక్కన ఉంచితే చాలామంది అధిక బరువును తగ్గాలని ఎన్నో రకాల ఎక్సర్సైజులు చేయడంతో పాటు.. ఆహారంలో డైట్ ని కూడా పాటిస్తూ ఉంటారు. అదే కాకుండా కొన్ని రకాల పోషకాలు ఉండే ఫ్రూట్స్ ని కూడా తింటూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తీసుకోవడం వలన కూడా అమాంతంగా బరువు పెరిగిపోతారు. ఆ ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
అవకాడో: ఈ అవకాడో లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం వీటిని తక్కువగా తినవలసి ఉంటుంది. ఎందుకనగా వీటిలో కొవ్వులు, క్యాలరీస్ అధిక మొత్తంలో ఉంటాయి.అయితే ఇవి సన్నగా ఉన్నవారికి బరువు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సుమారు అవకాడో లో 162 క్యాలరీలు కలిగి ఉంటుంది.అలాగే వీటిలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కే ,విటమిన్ బి, ప్రోటీన్లు లాంటి అధికంగా ఉంటాయి.మామిడి పండ్లు; ఈ పండు అరటిపండు లాగే ఈ మామిడి పండ్లు కూడా అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ పండు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ దీనిని తీసుకున్నవారు..
Health Benefits : అయితే బరువు పెరగడం ఖాయం…

తప్పకుండా కార్డియో ఎక్సర్సైజులు చేయాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పండులో 1.4 గ్రాముల ప్రోటీన్ ఉంటే 99 క్యాలరీలు కలిగి ఉంటుంది.అరటిపండు: అరటిపండు దీనిని చిరుతిండిగా తినే వారు కూడా ఉన్నారు. ఈ పండుని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. దీనిని సరియైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే ఈ పండు బరువుని కూడా పెరిగేలా చేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునేవారు. ఈ పండుని రోజుకు ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఎందుకనగా ఈ పండులో సాధారణ చెక్కెర కంటెంట్, క్యాలరీలు అధిక మొత్తంలో కలిగి ఉంటుంది మీడియం సైజు పండులో 105 క్యాలరీలు ఉంటే ఒక గ్రాము ప్రోటీన్ మాత్రమే కలిగి ఉంటుంది అరటిపండు