ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జంటలు పిల్లలు కలగడం లేదని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొంతమందికి వెంటనే పిల్లలు కలుగుతారు. కానీ చాలామందికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిన పిల్లలు కలగగలరు. అయితే ప్రస్తుతం అటువంటి వారికి తల్లితో పని లేకుండా ల్యాబ్ లో పిండం అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. పరిశోధన ప్రకారం ల్యాబ్లో ఎలుకల పిండాల శుక్రకణాల తో వాటి పిండాలను అభివృద్ధి చేయడం లో సక్సెస్ అయ్యారు. ఐదు సంవత్సరాలలో మానవుల విషయంలోనూ ఇదే జరుగుతుంది అని చెప్తున్నారు. 20207నాటికి ల్యాబ్లో బిడ్డ జన్మించడం సాధ్యం అవుతుంది అని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
మనుషుల కణాలపై కూడా ఈ ప్రయోగం చేస్తారని తెలిపారు. ఈ ప్రయోగంతో ఇద్దరు పురుషులు కూడా తండ్రులు అవుతారట. అంటే స్వలింగ సంపర్కులు కూడా తండ్రులు అవ్వగలరని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఏ వయసులోనైనా మహిళలకు బిడ్డ పుడుతుంది. ఈ టెక్నిక్ తో తల్లిదండ్రులు తమ బిడ్డని ఎటువంటి పోలికలతో చూడాలనుకుంటున్నారో ఆ విధంగా చూడవచ్చని శాస్త్రవేత్త నిఖిల్ అద్వానీ తెలిపారు. పరిశోధనలో మనుషుల అండాలు అభివృద్ధి అయ్యే సామర్థ్యాన్ని ఇన్ విట్రో గేమ్ జెనిస్ట్ పిలుస్తారు.. ఈ స్పెర్ము కణాలను ఉపయోగించి పిండాలను తయారుచేసి స్త్రీల కడుపులో అమరుస్తారు.

ఈ ప్రయోగం విజయవంతమైన పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు అండాలను అభివృద్ధి చేయడంలో దూసుకెళ్తున్నారు. అమెరికా యూనివర్సిటీ లోని శాస్త్రవేత్త నిఖిల్ అద్వానీ ఎలకలలో ఈ ప్రయోగం చేశారు. కావున మానవుల విషయంలో కూడా ఇదే సాధ్యమవుతుందని అయితే దీనికోసం ఐదు సంవత్సరాలు పడుతుందని తెలుపుతున్నారు. మానవులపై ప్రయోగాలు చేయాల్సిన సమయం రాబోతుందని నిఖిల్ అద్వానీ చెప్పారు. ఈ సంచలన విషయం ఏమిటంటే ఈ ఎలుకలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరు మగ ఎలుకలే ఈ పరిశోధనలో మగ ఎలుకల చర్మ కణాలను వినియోగించి అండాలు స్పెర్ములను తయారు చేసినట్లు నిఖిల్ అద్వానీ తెలిపారు.