Bread : ఈ రోజుల్లో చాలామంది బ్రేక్ ఫాస్ట్ బదులుగా బ్రెడ్ ని చాయ్ తో కలుపుకొని తింటున్నారు. బ్రెడ్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి వెంటనే అధిక శక్తిని అందిస్తాయి. బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. అయితే బ్రెడ్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇతర ఫుడ్ తో పోలిస్తే పోషకాలు కూడా తక్కువ పరిమాణంలోనే ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది వివిధ రకాల అరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
నిద్రలేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవద్దు. పరిగడుపున బ్రెడ్ తినడం వల్ల ఆకలి అధికమవుతుంది. ఎక్కువసార్లు తినేలా చేస్తుంది. ఫలితంగా ఉబకాయం సమస్యలు వస్తాయి. వైట్ బ్రెడ్ లో కార్బోహైడ్రేడ్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గ్లైసెమిక్ స్థాయిలు కూడా అధికంగా ఉంటాయి. నిపుణుల అంచనా ప్రకారం ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఆకలి పెంచడంతోపాటు అతిగా తినేలా చేస్తాయి. దీని ఫలితంగా అధిక బరువు లేదా ఊబకాయం సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలను అధికం చేస్తాయి.
Bread : పరిగడుపున బ్రెడ్ ముక్కలను తింటున్నారా….?

ఫలితంగా టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వైట్ బ్రెడ్ లోనే కార్బోహైడ్రేట్లు మలబద్ధక సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి బ్రెడ్ తినటానికి కంటే ముందు ఏదైనా తేలికపాటి ఆహార పదార్థాలు తినాలి. వైట్ బ్రెడ్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉబ్బరంతో పాటు ఇతర సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో బ్రెడ్ ని తినటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.